సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ కున్న స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . నందమూరి నటవారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పోలికలతో ఆయన నటన క్వాలిటీస్ తో ఇండస్ట్రీలో తాతకు మించిన మనవడిగా రాజ్యమేలేస్తున్నాడు . అంతే కాదు ఎన్టీఆర్ ఏ పాత్ర చేసిన ఆ పాత్రకు ప్రాణం పోసినట్లే ఉంటుంది . ఎలాంటి రోల్స్నైనా అవలీలగా నటించే సత్తా ఉన్న తెలుగు హీరో అనే చెప్పాలి . ఒకప్పుడు ఇంత టాలెంట్ ఉన్న హీరో ఎవరు అంటే మాత్రం కచ్చితంగా నందమూరి తారక రామారావు గారు అని చెప్పక తప్పదు .
ఇప్పుడు అలాంటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ . కాగా జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాల పరంగానే కాదు పర్సనల్ లైఫ్ పరంగా కూడా వేలెత్తి చూపించే నెగటివ్ కోణం ఒక్కటంటే ఒక్కటి లేదు . తారక్ వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి . కాగా తారక్ చదువుకునే టైంలోనే వాళ్ళ అమ్మ షాలిని ..తారక్ దగ్గర నుంచి ఓ ప్రామిస్ చేయించుకుందట . “మొదటి నుంచి మహిళలను గౌరవించే ఫ్యామిలీ మనది .. అలాగే మనం మహిళల పట్ల నడుచుకోవాలి ..ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి ..ప్రేమ దోమ అంటూ తప్పుడు నిర్ణయాలు తీసుకొని నందమూరి ఫ్యామిలీ పేరుకి కళంకం తీసుకురావద్దు.. ఇదే నేను ని నుండి కోరుకునేది ..నువ్వు నన్ను బంగ్లాల్లో పెట్టకపోయినా.. కోట్ల ఆస్తి నాకు ఇవ్వకపోయినా నందమూరి ఫ్యామిలీకి నీవల్ల చెడు పేరు రానివ్వద్దు” అంటూ ప్రామిస్ చేయించుకుందట .
తారక్ కూడా ” అలాంటి తప్పు నేను ఏది చేయను అమ్మ” అంటూ అమ్మషాలిని కి ప్రామిస్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో మరోసారి వైరల్ గా మారింది. అన్న మాట ప్రకారమే ఇప్పటివరకు నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ వల్ల ఒక్కటంటే ఒక్క నెగిటివ్ రీమార్క్ కూడా రాలేదు . ఇంకా నందమూరి ఫ్యామిలీకున్న పరువుని ట్రిపుల్ స్థాయిలో ఇంక్రీజ్ చేశాడు తారక్..!!