టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా దేవర. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సూపర్ హిట్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవరపై మామూలు అంచనాలు లేవు.
ఈ సినిమా సముద్రం ఒడ్డున వాటర్ బ్యాక్ డ్రామాగా తెరకెక్కుతోంది. పైగా బాలీవుడ్ కండల హీరో సైఫ్ ఆలీఖాన్ ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సైఫ్ ఆలీఖాన్ లుక్ చూస్తుంటే చాలా క్రూరంగా కనిపిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే యేడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న ధియేటర్లలోకి దింపుతున్నారు.
అయితే ఈ సినిమాకు జరుగుతున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ లెక్కలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. తాజాగా దేవర సినిమా ఓటిటి డీల్ పై సాలిడ్ బజ్ వైరల్ అవుతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని అన్ని భాషలకు కలిపి దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
ఇందుకోసం వాళ్ళు ఏకంగా రు. 200 కోట్లకు పైనే చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ డీల్ ను బట్టి దేవరపై ఎలాంటి అంచనాలు ? ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది. ఈ భారీ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువసుధా ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.