Newsత‌న‌ను పిచ్చ తిట్లు తిట్టిన స్టార్ హీరోయిన్లు క‌ష్టాల్లో ఉంటే ఎన్టీఆర్...

త‌న‌ను పిచ్చ తిట్లు తిట్టిన స్టార్ హీరోయిన్లు క‌ష్టాల్లో ఉంటే ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా…!

టాలీవుడ్ లో దివంగత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ? ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లు.. దర్శకులతో పనిచేశారు. అలాగే ఎంతో మంది సహా నటీనటులతో పనిచేశారు. విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్‌ను తిట్టిన వాళ్లకు ఎన్టీఆర్ పై ద్వేషం పెంచుకున్న వాళ్లకు కూడా పిలిచి మరీ అవకాశాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనకే చెందుతుంది.

భానుమతితో ఎన్టీఆర్ మల్లేశ్వరి సినిమాలో నటించారు. ఆ తర్వాత కారణం ఏదైనా భానుమతి ఎన్టీఆర్ పట్ల విపరీతమైన కోపం పెంచుకున్నారు. ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీలో పలువురు ముందు ఆమె నానా రకాలుగా తిట్టిపోసేవారు అన్న ప్రచారం తెలిసిందే. అప్పట్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఎన్టీఆర్ సినిమాలలోనే కాదు నిజ జీవితంలో కూడా నటించేస్తున్నారు అని ఆయనకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. అయినా ఎన్టీఆర్ మాత్రం ఆమెకు పిలిచి తన సినిమాలలో అవకాశాలు ఇచ్చేవారు.

చివరకు తన తనయుడు బాలకృష్ణ సినిమాలలోనూ కావాలని భానుమతిని పట్టుబట్టి మరీ పెట్టించారు. ఇక సావిత్రి లావైపోయిందని చాలామంది హీరోలు పక్కన పెట్టేశారు. ఎవరో ఎందుకు సావిత్రి – ఏఎన్ఆర్ కాంబినేషన్ ఎంత గొప్ప హిట్ కాంబినేషనో అందరికీ తెలిసిందే .సావిత్రి కాస్త లావెక్క‌గానే ఆయ‌న‌ పక్కన పెట్టేశారు. అయినా ఎన్టీఆర్ మాత్రం ఆమె క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు తన పక్కన ఐదు సినిమాలలో అవకాశం ఇచ్చారు.

అలాగే భానుమతితో చివరి వరకు నటించింది కూడా ఆయనే.. ఇక మరో సీనియర్ నటిమని బి.సరోజా దేవిని అందరూ వదిలేసిన ఆమెకు చివరి వరకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. అలాగే పొగరుబోతు అంటూ జమున గారిని అందరూ పక్కన పెట్టిన కూడా ఆమెకు తన సినిమాలలో అవకాశాలు ఇచ్చారు. ఇక మీతో పని చేయను అని శపథం చేసిన బాపు – రమణకు అవకాశం ఇచ్చిన వ్యక్తిత్వం కూడా ఎన్టీఆర్దే. ఏది ఏమైనా ఎన్టీఆర్ పట్ల ఎవరైనా వ్యతిరేక భావంతో ఉన్నా ఆయన మాత్రం మనసులో అలాంటివేవీ పెట్టుకోకుండా వారికి అవకాశాలు ఇవ్వటం నిజంగా ఆయన గొప్ప గుణానికి నిదర్శనంగా చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news