ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో .. మెగా ఫ్యామిలీ అన్న పదం కనబడితే చాలు ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు మెగా ఫ్యామిలీకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేవారు . అయితే రాను రాను మెగా ఫ్యామిలీలో జరుగుతున్న కొన్ని పనులు కారణంగా ఆ రెస్పెక్ట్ తగ్గిపోతుంది. మరి ముఖ్యంగా శ్రీజ – నిహారిక బ్యాక్ టు బ్యాక్ విడాకులు తీసుకోవడం వల్ల మెగా ఫ్యామిలీ పరువు పోయిందని చెప్పాలి .
రీసెంట్గా నాగబాబు ఫ్యామిలీ కెన్య టూర్ కి వెళ్ళింది. దానికి సంబంధించిన ఫోటోలను ఆయన కూతురు నిహారిక సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. రీసెంట్గా తన కుటుంబంతో దిగిన ఫొటోస్ ను తన అన్న వరుణ్ తేజ్ తో దిగిన ఫోటోను షేర్ చేసింది నిహారిక . అయితే ఈ ఫొటోస్ పై చాలా మంది పాజిటివ్‌గా స్పందిస్తుంటే .. మరి కొంతమంది మాత్రం నెగిటివ్‌గా స్పందిస్తున్నారు . నిహారిక చాలా క్యూట్ గా ఉందని విడాకుల తర్వాత కూడా చాలా బోల్డ్ గా తన సిచువేషన్ నుంచి బయటపడిందని చెప్పుకొస్తుంటే…
వరుణ్ తేజ్ ను చూసి మాత్రం వదిన ఎక్కడన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగబాబు భార్య చాలా డిఫరెంట్ లుక్స్ లో ఉందని కామెంట్స్ చేస్తున్న అభిమానులు నాగబాబుపై మాత్రం ఫుల్ యాంగ్రీ గా కామెంట్స్ చేస్తున్నారు. ఆ స్నేక్ బాబు అక్కడే వదిలి వచ్చేసేయ్ నిహారిక అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఇటువంటి కామెంట్స్ ని ఏ మాత్రం పట్టించుకోని మెగా ఫ్యామిలీ ఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది..!!