నాగచైతన్య తన కెరీర్లో అతిపెద్ద రిస్క్ చేస్తున్నాడు. సమంతకు విడాకులు ఇచ్చే ఇచ్చాక చైతుకు సరైన హిట్ లేదు. బంగార్రాజు సినిమా సక్సెస్ అయిన అందులో నాగార్జునతో పాటు కృతి శెట్టి కూడా ఉన్నారు. చైతుకు సోలోగా మాత్రం హిట్ లేదు. పైగా వరుస పెట్టి అన్ని డిజాస్టర్లు అవుతున్నాయి. థాంక్యూ – లాల్ సింగ్ చద్దా – కస్టడీ సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. ఈ టైంలో చైతు కెరీర్ లోనే బిగ్ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు.
చందు మొండేటి – సాయి పల్లవి కాంబినేషన్లో తయారవుతున్న పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమాకు పేపర్ మీద రు. 80 కోట్ల వరకు ఖర్చు తేలుతుందని తెలుస్తోంది. సినిమా పూర్తి అయ్యేసరికి మరో 10 కోట్లు దాటిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. వాస్తవానికి నాగచైతన్యకు అంత మార్కెట్ లేదు. నాగచైతన్య సినిమాకు థియేటర్ రైట్స్ రు. 15 కోట్లు పలికితేనే గొప్ప అన్నట్టుగా ఉంది. కానీ సబ్జెక్టు పరంగా ఖర్చు ఉంది. అందుకే గీతా సంస్థ నాగచైతన్యపై అంత ఖర్చు పెట్టటానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సంస్థతో సంప్రదింపులు ప్రారంభించారని సమాచారం. టోటల్ నాన్ థియేటర్ హక్కులు తీసుకుంటే నెట్ ప్లిక్స్ పని సులువు అవుతుందని గీతా సంస్థ ఆలోచనగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సముద్రం మీద ఎక్కువగా జరిగే కావడంతో సిజీ వర్క్ ఎక్కువ అవసరం ఉంది. అందుకే ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుందని తెలుస్తోంది. దీనికి తోడు పాన్ ఇండియా నటులను కూడా తీసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా చైతు కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా మిగిలిపోనుంది.
సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఇంత మొత్తం రికవరీ అవుతుందా అంటే సందేహంగానే కనిపిస్తోంది. సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన ఇప్పటికే వరుస ప్లాపుల్లో ఉన్న చైతు కెరీర్ మరింత డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయినట్టు అవుతుంది. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చైతు ఇంత రిస్క్ చేయకూడదని టాలీవుడ్లో చర్చ జరుగుతుంది. తన మార్కెట్‌కు తగినట్టుగా సింపుల్ కథలను ఎంచుకుని సినిమాలు చేసుకుంటూ పోవాలి గాని.. ఇంత పెద్ద రిస్క్ ఎందుకు ? అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.