సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై ట్రోల్స్ చేయడం ప్రస్తుతం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా హీరోయిన్ల పై సోషల్ మీడియాలో ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. వీటికి కొంతమంది హీరోయిన్లు గట్టిగా స్పందిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. మరికొందరు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. ఇక బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ విషయంలో ఎన్నోసార్లు ట్రోలింగ్ కు గురైంది.
ఈ భామను చాలామంది అనసూయ ఆంటీ అంటూ ఆకతాయి కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో చాలాకాలం వేధిస్తున్నారు. ఈ యాంకర్ ఆకతాయిలు చేసే కామెంట్లకు చాలా ఘాటుగానే కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. చివరకు విజయ్ దేవరకొండ అభిమానులను కూడా అనసూయ వదలలేదు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణిని కూడా కొందరు నెటిజన్లు తనను ఆంటీ అని కామెంట్ చేయడంతో ఘాట్ కౌంటర్ ఇచ్చింది.
తాజాగా ప్రియమణి బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి చాలా బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఓ నెటిజన్ బ్లాక్ ఆంటీ అని నెగటివ్ కామెంట్ పెట్టాడు. దీంతో ప్రేయమణికి కోపం వచ్చి ఇప్పుడు నా వయసు 38 ఏళ్లు.. అయినా హాట్ గానే ఉన్నాను.. ఇక నోరు మూసుకో అంటూ గట్టి సమాధానం ఇచ్చింది. అలాగే పాజిటివ్ గా కూడా ప్రియమణి కామెంట్ చేసింది.
నన్ను ఆంటీ అని కామెంట్ చేయడంలో ఎలాంటి తప్పులేదు.. ఎలాంటి అభ్యంతరం లేకుండా నన్ను ఆంటీ అని పిలవవచ్చు.. ఏజ్ పెరిగితే సిగ్గుపడాల్సిన అవసరం లేదు.. వయసు పెరగటం అనేది మామూలుగా జరిగే ప్రక్రియ అంటూ వెల్లడించింది. దీంతో ప్రియమణి చేసిన కామెంట్లకు చాలామంది నెటిజన్ల నుంచి పాజిటివ్గా కామెంట్లు వస్తున్నాయి.