Moviesనందమూరి ఫ్యాన్స్ కి "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" టీం స్పెషల్...

నందమూరి ఫ్యాన్స్ కి “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” టీం స్పెషల్ సర్ ప్రైజ్ .. బాలయ్య కూడా ఊహించలేదుగా ..!!

టాలీవుడ్ యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి తాజాగా నటించిన సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది . ఫుల్ టు ఫుల్ కామెడి ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క పెర్ఫార్మన్స్ అద్దిరిపోయింది. నవీన్ కామెడీ కూడా ఈ సినిమాకి ప్లస్ గా మారింది .

కాగా చాలా రోజుల తర్వాత అనుష్క తెరపై కనిపించడంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు . అయితే వాళ్ళని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా అనుష్క సాటిస్ఫై చేసిందని చెప్పాలి . మరి ముఖ్యంగా సినిమాలో అనుష్క ఎప్పుడూ లేనివిధంగా ఈసారి హద్దులు మీరి కొన్ని బోల్డ్ డైలాగ్స్ చెప్పడమే కాకుండా.. తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది . కాగ ఈ సినిమా మొత్తం హిట్ అవ్వడానికి కర్త – కర్మ – క్రియ అంతా కూడా నవీన్ పోలిశెట్టి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అయితే ఈ సినిమాకి వెళ్లిన నందమూరి ఫ్యాన్స్ కచ్చితంగా ధిల్ గా ఫీల్ అవ్వకు తప్పదు . సినిమా స్టార్టింగ్ లోనే నందమూరి అభిమానులను డైరెక్టర్ బాగా సాటిస్ఫై చేశారు. ఆ సీన్ చూసిన ఎవరైనా సరే జై బాలయ్య అనక తప్పదు. మరి ఆ సర్ ప్రైజ్ ఏంటో తెలియాలంటే మీరు మీ ఇంటికి దగ్గరలోని ధియేటర్స్ కి వెళ్లి సినిమా చూసి ఆ సీన్ ని ఎంజాయ్ చేయండి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news