Movies"ప్లీజ్ ఆ హీరోయిన్ నే ఫిక్స్ చేయండి".. రాజమౌళికి మహేశ్ స్పెషల్...

“ప్లీజ్ ఆ హీరోయిన్ నే ఫిక్స్ చేయండి”.. రాజమౌళికి మహేశ్ స్పెషల్ రిక్వెస్ట్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు .. ప్రెసెంట్ గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెసెంట్ షూటింగ్ మోడ్ లో ఉంది . అంతేకాదు ఈ సినిమా అయిపోగానే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా అడ్వెంచర్స్ సినిమా చేయబోతున్నాడు . ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు రాజమౌళి సినిమాలో హీరోయిన్ విషయంలో ఫుల్ డిస్టర్బ్ అవుతున్నారట .

ఏ హీరోయిన్ ని చూపించిన సరే రిజెక్ట్ చేస్తున్నారట . కాగా ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు ఫేవరెట్ హీరోయిన్ పేరు మరోసారి తెర పై వైరల్ అవుతుంది . మహేష్ బాబు శృతిహాసన్ పేరును ఎక్కువగా సజెస్ట్ చేస్తున్నారట. సల్లార్ సినిమాలో నటిస్తూ పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ అంటే మహేష్ కి ముందు నుంచి ఇష్టమే. వీళ్ళిద్దరి కాంబోలో శ్రీమంతుడు సినిమా వచ్చింది .

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు మహేష్ బాబు శృతిహాసన్ కి మంచి ఫ్రెండ్ అయిపోయాడు. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంటుంది . అందుకే ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ ని సజెస్ట్ చేస్తున్నారట. అయితే జక్కన్న మాత్రం బాలీవుడ్ బ్యూటీస్ ని పెట్టేందుకు ట్రై చేస్తున్నారట. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరైతే బాగుంటుందా అంటూ అభిమానులు సైతం పలువురు హీరోయిన్స్ పేర్లను కామెంట్ చేస్తున్నారు . మరి మీ దృష్టిలో ఈ సినిమాల్లో హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ తెలియజేయండి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news