సినిమా ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రెబెల్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఆ తర్వాత పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నారు . కాగా కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎప్పుడు ఎవరికి హాని చేయని ఆయన.. అందరితో ఎంతో హెల్తీగా మాట్లాడే ప్రభాస్ కి ఓ రాజకీయ నాయకుడు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చాడు అన్న వార్త అప్పట్లో వైరల్ అయింది .
మనకు తెలిసిందే కృష్ణంరాజు పొలిటికల్ పార్టీలో మెంబర్గా ఉన్నారు. అయితే ఎలక్షన్స్ మూమెంట్లో ఓసారి ప్రభాస్ ఆ పార్టీ తరపున ప్రచారం చేయడానికి రాబోతున్నాడు అని ప్రచారం జరగడంతో భయపడిపోయిన ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడు ప్రభాస్ కి కాల్ చేసి మరి స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చారట. ” సినిమాలు చేసుకునే వాడివి సినిమాలు చెయ్. మిగతా వాటిల్లో తల దూర్చొద్దు. దూరిస్తే ఏమవుతుందో కూడా నీకు తెలుసు.. నరికేస్తాం” అంటూ అప్పట్లో పరోక్షకంగా ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారట .
అయితే ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోని ప్రభాస్.. అసలు నాకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదు.. మీరు బెదిరించారని భయపె.. డుతున్నారని కాదు నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు .. నేను రాను మీరు ఏమి నరుక్కున్న ఏం పీక్కున్న నాకు అనవసరం అంటూ కూసింత ఘాటుగానే ఆన్సర్ ఇచ్చారట”. అయితే ఆ విషయంలో కృష్ణంరాజు మాత్రం ఫుల్ సీరియస్ అయిపోయారని మెయిన్ హెడ్ నుంచే కాల్ చేయించి మరి ఆ పొలిటిషియన్ కి క్లాస్ బాగా డోస్ ఇచ్చారని వార్తలు వినిపించాయి..!!