సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ నయనతార .. రీసెంట్గా నటించిన సినిమా “జవాన్”. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కింగ్ షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో దీపికా పదుకొనే సెకండ్ హీరోయిన్గా నటించింది . ప్రియమణి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. కాగ ఈ సినిమాతో మళ్ళీ తన పునర్వైభవం అందుకున్న నయనతార మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి డిసైడ్ అయింది .
కాగ ఇలాంటి క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆమె విగ్నేశ్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయనను పెళ్లి చేసుకునే ముందు అమ్మడు చాలా మందితో ప్రేమాయణాలు నడిపి ఫ్లాప్ అయింది . వాళ్ళల్లో రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ రాజకీయ నాయకుడు మరెవరో కాదు తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే స్టాలిన్ కొడుకు ఉదయ్ నిధి స్టాలిన్ .
ఈయన పలు సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే . కొన్ని సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేశారు . ఓ ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన ఆయన మొదట విజయ్-త్రిష లతో కలిసి కురివి అనే సినిమాను నిర్మించారు . ఈ సినిమా తర్వాత సూర్య-నయన్ కాంబినేషన్లో మరో సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా టైమ్ లోనే ఉదయ్ నిధి -నయన్ స్టాలిన్ చాలా బాగా క్లోజ్ గా మూవ్ అయ్యారట . కొన్నాళ్లపాటు డేటింగ్ కూడా చేశారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే అప్పటికే పెళ్ళై పిల్లలు ఉన్న ఆయన నయన్ ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారట. ఆయనతో బంధం అక్కడే ముగిసిపోయింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ప్రజెంట్ మరోసారి ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!