Moviesఅనుష్క ఆ మాట చెప్పగానే చేతులెత్తి దండం పెట్టేసిన ప్రభాస్.. డార్లింగ్...

అనుష్క ఆ మాట చెప్పగానే చేతులెత్తి దండం పెట్టేసిన ప్రభాస్.. డార్లింగ్ ఇంత పిరికివాడా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ – అనుష్కల మధ్య ఫ్రెండ్షిప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . కొందరు ఈ ఫ్రెండ్షిప్ ని ఫ్రెండ్షిప్ అని స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ అని అంటుంటే .. మరి కొందరు వీళ్లది ఫ్రెండ్షిప్ కాదు అని ప్రేమ అని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని ప్రచారం చేస్తున్నారు . వీళ్ళ మధ్య ఉన్నది ప్రేమ కానివ్వండి ఫ్రెండ్షిప్ కానివ్వండి .. .ఆ రిలేషన్షిప్ ని హెల్దీగా మెయింటైన్ చేస్తున్నారు అది గ్రేట్ అంటూ మరికొంతమంది చెప్పుకొస్తున్నారు.

అయితే అనుష్క ప్రభాస్ కు చెప్పందే ఏ పని చేయదు అన్న రూమర్ ఎప్పటినుంచో వినిపిస్తుంది. మరి ముఖ్యంగా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయినప్పటి నుంచి ప్రతి స్క్రిప్ట్ విషయంలో ఆయనతో డిస్కస్ చేస్తుందట . వేదం సైజ్ జీరో లాంటి కాంట్రవర్షియల్ రోల్స్ కు సైన్ చేసేటప్పుడు కూడా ప్రభాస్ సలహానే తీసుకునిందట స్వీటీ . అయితే స్వీటీ ఇన్ని సినిమాలు చేసిన ఎన్నో వైవిధ్యమైన రోల్స్ ఆమె చేయగలిగిన ఆమె కోరిక మాత్రం తీరలేదట.

ఆమెకు ఓ లేడీ సైకో విలన్ రోల్ లో కనిపించాలని ఆశగా ఉందట. ఇదే విషయం ఎన్నోసార్లు ప్రభాస్ కు చెప్పిందట . ప్రభాస్ వెంటనే చేతులెత్తి దండం పెట్టేసి.. నీ ఆలోచనలు ఎంత వైలెంట్ గా ఉన్నాయి ఏంటి స్వీటీ ..? అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశారట . అంతేకాదు స్వీటీ ఇప్పటికైనా అలాంటి పాత్ర వస్తే చేయడానికి రెడీగా ఉందట . కానీ మన డైరెక్టర్ లు అలాంటి పాత్రను ఆమె కోసం రాయడం లేదు . చూద్దాం స్వీటీ కోరిక ఎప్పుడు తీరుతుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news