టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు . అయితే ఏప్రిల్ 5న దేవర సినిమా రిలీజ్ చేయడం వెనక పెద్ద స్ట్రాటజీనే ఉంది అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .
దేవర సినిమా 2024 ఏప్రిల్ 5వ తేదీ శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 6, 7 తేదీలు సెలవులు . ఇది సినిమాకి బాగా కలిసి వస్తుంది. అంతేకాదు 9వ తేదీ ఉగాది పండుగ ఆ తర్వాత పదవ తేదీ ఈ రెండు కూడా దేవరకు మంచి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి . అంతేకాదు ఆ తర్వాత 13 , 14 తేదీలలో వీకెండ్ వచ్చేస్తుంది .
ఇక వరుసగా సెలవలే సెలవులు . అంతేనా ఏప్రిల్ 17వ తేదీ శ్రీరామనవమి పండుగ ఇక లీవ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా బ్యాక్ టు బ్యాక్ అన్ని లీవ్ లు ఉండడం వల్లనే దేవర సినిమాను ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ఫిక్స్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.