సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే హవ్వ తగ్గిందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా సినిమా అవకాశాలు తగ్గినప్పటి నుంచి అమ్మడు సోషల్ మీడియాకి కూసింత దూరంగానే ఉంది. ఎప్పుడైతే బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు పూజా హెగ్డే సూసైడ్ చేసుకోవాలి అనుకునిందని ..సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది అని ట్విట్ చేసి బాలీవుడ్లో ఆమె పేరు రోడ్డు మీదకి ఈడ్చారో అప్పటినుంచి పూజ హెగ్డే సోషల్ మీడియాలో యాక్టివ్గా మారింది . తనదైన స్టైల్ లో పలు డృఎస్ ల్లో దర్శనమిస్తూ మళ్ళి తన పేరుకి పునర్ వైభవం దక్కించుకునేలా చేస్తుంది .
అయితే రీసెంట్ గా పూజా హెగ్డే సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసుకుంది . చాలా ట్రెడిషనల్ లుక్స్ లో దర్శనమిచ్చిన పూజా హెగ్డే అవుట్ ఫిట్ అమ్మాయిలను తెగ ఆకట్టుకుంటుంది. బ్లూ కలర్ కుర్తి టైపులో ఉండే డ్రెస్సులో.. చాలా ట్రెడిషనల్ గా ఎతినిక్ వేరులో దర్శనమిచ్చింది పూజ హెగ్డే. దీంతో అందరు పూజ హెగ్డే డ్రెస్ పై రీసెర్చ్ లు మొదలుపెట్టారు. ఈ డ్రెస్ ఎక్కడ కొనింది..? ఎంత అయ్యింది ..? అంటూ ఆరా తీస్తున్నారు .
అందుతున్న సమాచారం ప్రకారం ఈ డ్రెస్ ను ప్రముఖ డిజైనర్ అనిత డోంగ్రా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ డ్రెస్ ఖరీదు దాదాపు లక్ష ఇరవై వేలకు పైగాని ఉంటుంది అంటూ తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో పూజ హెగ్డే పేరు మారుమ్రోగిపోతుంది . అసలు నీ చేతిలో సినిమాలు లేవు ..మరి అంత కాస్ట్ పెట్టి డ్రెస్ ఎలా కొనుగోలు చేశావు అంటూ ఆరా తీస్తున్నారు..జనాలు..!!