Movies' పుష్ప 2 ' హైలెట్స్ లీక్ చేసిన దేవిశ్రీ ప్ర‌సాద్‌…....

‘ పుష్ప 2 ‘ హైలెట్స్ లీక్ చేసిన దేవిశ్రీ ప్ర‌సాద్‌…. అబ్బో అదిరిపోయే ట్విస్టులు కూడా…!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా సినిమా పుష్ప 2పై దేశవ్యాప్తంగా అన్ని భాషల సినీ అభిమానులతో పాటు ఇతర దేశాల సినీ అభిమానులలో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – ఎలమంచిలి రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సమ్మ‌ర్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పుష్ప 1 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా అదరగొట్టేసింది. నార్త్ ఇండియాలో ఏకంగా ప్రమోషన్లు లేకుండానే రు. 100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది.

తాజాగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న దేవిశ్రీప్రసాద్ సోషల్ మీడియా లైవ్ లో పుష్ప 2 గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. పుష్ప 2 పార్ట్ వన్ మించిపోయేలా మరింత అద్భుతంగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నట్టు దేవిశ్రీ చెప్పాడు. అలాగే పుష్ప 2 లో వచ్చే ఒక భారీ యాక్షన్ స‌న్నివేశం అందర్నీ ఎంతో థ్రిల్‌కు గురి చేస్తుందని దేవిశ్రీ తెలిపాడు.

ఇంటర్వెల్ బ్యాంగ్‌ తో పాటు సెకండాఫ్ లో వచ్చే లారీల ఫైట్ అదిరిపోతుందన్న విషయం బయటకు వచ్చింది. ఈ సీనుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news