టాలీవుడ్ లో కిరణ్ రాథోడ్ రెండు దశాబ్దాల క్రితం మిడిల్ రేంజ్ హీరోయిన్గా కొన్ని సినిమాలలో నటించారు. నువ్వు లేక నేను లేను – జెమిని – కెవ్వు కేక – భాగ్యలక్ష్మి బంపర్ డ్రా సినిమాలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన కిరణ్ తర్వాత పెద్దగా అవకాశాలు రాక సినిమాల్లో కనిపించలేదు. బాలీవుడ్లో అవకాశాల కోసం ట్రై చేసిన అక్కడ ఆమెకు ఛాన్సులు రాలేదు.
అయితే ఈ హాట్ భామ ఎప్పుడూ అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ 7న్ లో కంటెస్టెంట్‌గా ఎంపికైంది. అయితే తొలి వారంలోనే ఆమె ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది. తాను ఛాన్సుల కోసం అని ముంబై వెళ్ళినప్పుడు దారుణమైన వ్యక్తులను కలిశానని చెప్పింది.
కొందరు సినిమాలలో అవకాశం ఇస్తామని పిలిపించి.. కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టాక రాత్రికి వచ్చేయంటూ అసభ్యకరంగా మాట్లాడారని వాపోయింది. ఇలా చాన్సుల కోసం కాంప్రమైజ్ కావటం కంటే ఏదైనా సైడ్ బిజినెస్ పెట్టుకోవడం చాలా బెస్ట్ అనిపించిందని రాథోడ్ వాపోయింది. తాను నాలుగేళ్లు ఓ వ్యక్తితో డేటింగ్ చేశానని.. తర్వాత అతడు సరైన పర్సన్ కాదని తెలియడంతో అతడికి దూరమైనట్టు చెప్పింది.
పెళ్లి చేసుకుందామనే సమయానికి అతడు అసలురంగు బయటపడింది.. అతడిని పెళ్లి చేసుకుంటే నన్ను ఖచ్చితంగా చంపేసేవాడు.. తర్వాత మరో వ్యక్తిని లవ్ చేశా అతను కూడా నాకు సూటబుల్ పర్సన్ కాదు అని అర్థం కావడంతో అతనికి దూరమయ్యాను.. అప్పటినుంచి ఏడేళ్లు సింగల్ గా ఉంటున్నా… ఇప్పటి వరకు అయితే నాకు పెళ్లి ఆలోచన లేదని కిరణ్ రాథోడ్ వెల్లడించింది.