టాలీవుడ్ ఇండస్ట్రీలో మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ఆ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చూడడానికి చాలా చక్కగా అనిపిస్తుంది . పేరుకి మలయాళి కుట్టి అయినా..ఆకట్టు ఆ బొట్టు ఆ రూపం అంతా కూడా అచ్చ తెలుగు ఆడపిల్లలనే ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు కూడా అనుపమ లుక్ కి ఫిదా అయిపోతూ ఉంటారు .
ఈ మధ్యకాలంలో తన ఖాతాలో హ్యాట్రిక్ హిట్లు వేసుకున్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనుపమ పరమేశ్వరన్ తన పెళ్లి గురించి ఓపెన్ అప్ అయింది . ఓ టాస్క్ లో భాగంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ..”తాను చేసుకుంటే కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని ..అసలు నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారని ఎలా అనిపించింది..? ఎలా అనుకుంటారు ..?”అంటూ తిరిగి హోస్ట్ ని ప్రశ్నించింది .
అంతేకాదు గతంలో అనుపమ పరమేశ్వరన్ ప్రేమపై పరోక్షంగా ఎన్నోసార్లు స్పందించింది . కానీ అతగాడు ఎవరు అనేది మాత్రం బయట పెట్టలేదు. దీంతో రీసెంట్గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి తన ప్రేమ విషయం ఇలా పరోక్షంగా బయట పెట్టడంతో ..అసలు అనుపమ కు కాబోయే భర్త ఎవరు ..? ఆమె లవ్ చేస్తున్న పర్సన్ ఎవరు ..?అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోనా ..?లేకపోతే మలయాళీ ఇండస్ట్రీ హీరోనా..? అంటూ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు..!!