Moviesఅల్లు అర్జున్ హీరోగా..శ్రీజ హీరోయిన్ గా మిస్ అయిన బ్లాక్ బస్టర్...

అల్లు అర్జున్ హీరోగా..శ్రీజ హీరోయిన్ గా మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఏంటో తెలుసా..? బ్రతికిపోయాడు బన్నీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ మెగా హీరోలకు ఉన్న ప్రత్యేక గుర్తింపు మరి ఏ హీరోలకి లేదనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది మెగా హీరోలు మెగా ఫ్యామిలీ ట్యాగ్ ఉపయోగించుకొని ఇండస్ట్రీలకు వచ్చి సక్సెస్ అయ్యారు అన్న విషయం మనందరికీ బాగా తెలిసిందే. వాళ్లలో ఒకరే అల్లు అర్జున్. ప్రెసెంట్ మెగా ఫ్యామిలీ ట్యాగ్ వద్దంటున్నాడు కానీ మొదట్లో మాత్రం మెగా ఫ్యామిలీ ట్యాగ్ ని ఉపయోగించుకొని సినిమా అవకాశాలు సంపాదించుకున్నాడు .

బన్నీ హీరోగా మెగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ హీరోయిన్గా ఓ సినిమా రావాల్సి ఉన్నింది. కానీ చిరంజీవికి ఇష్టం లేని కారణంగా ఆ సినిమాను మొదట్లోనే ఆపేశారు . ఆ సినిమా మరేదో కాదు.. గంగోత్రి . బన్నీ హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నా టైంలో రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్లి అల్లు అరవింద్ స్పెషల్ రిక్వెస్ట్ మీద గంగోత్రి సినిమాను డైరెక్టర్ చేయమని చెప్పుకొచ్చారు . ఇదే క్రమంలో హీరోయిన్గా కొత్త బ్యూటీ ని తీసుకుంటేనే అల్లు అర్జున్ కెరియర్ బాగుంటుంది అనుకున్న టైంలో వాళ్లు వీళ్లు ఎందుకు ..

శ్రీజ కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అనుకుంటుంది .. ఆమెను తీసుకోండి అంటూ సురేఖ సజెస్ట్ చేసిందట . అయితే మొదటి నుంచి చిరంజీవికి తన ఇంటి కూతుర్లు తెరపై నటించడం ఇష్టం లేదు .. అందుకే చిరంజీవి వద్దంటే వద్దు అంటూ మొండిగా వాదించి శ్రీజను హీరోయిన్ కాకుండా చేశారు . ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి ఆర్తి అగర్వాల్ చెల్లెలు అతిథి అగర్వాల్ వచ్చింది
. మొత్తానికి చిరంజీవి ..శ్రీజ ను హీరోయిన్ కాకుండా మంచి పనే చేశాడు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news