కళాతపస్వి కే. విశ్వనాథ్ తీసిన అనేక కళాత్మక సినిమాల్లో మేలి ముత్యం వంటిది శంకరాభరణం. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నా.. విడుదలైన తర్వాత.. దక్షిణాది సినిమా రంగాన్నే కాదు.. యావత్ భారత దేశ సినిమా రంగాన్ని కూడా ఒక ఊపు ఊపేసింది. కథ, కథనంలో బిగింపు, పాటలు, సంగీతం.. శాస్త్రీయతకు పెద్దపీట వేయడం వంటివి సినిమాను హిమాలయ శిఖరాల ఎత్తుకు తీసుకువెళ్లింది. అయితే.. దీనికి ముందు విషయాలు తలుచుకుంటే.. అనేక ఇబ్బందులు వచ్చాయని కే. విశ్వనాథ్.. ఓ టీవీ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.
ముందు ఈ సినిమాను శోభన్‌బాబుతో చేయించాలని అనుకున్నాం. అడ్వాన్స్ పట్టుకుని ఆయన ఇంటికి వెళ్లాం. ఏదైనా సినిమా ఒప్పుకొంటే.. శోభన్‌బాబు అడ్వాన్స్ ఇస్తే తప్ప సంతకాలు చేయరు. అందుకే.. నేను స్వయంగా 2 లక్షల రూపాయల ను తీసుకువెళ్లాను. అయితే.. కథ విన్నాక.. ఆయన పెదవి విరిచారు. కానీ, సరే.. అన్నారు. అయితే, అడ్వాన్స్ తీసుకునేందు కు వెనుకాడారు. దీంతో నాకు అర్థమైంది. మళ్లీ ఆయనను సంప్రదించలేదు. ఆయన కూడా మమ్మల్ని సంప్రదించలేదు
అని విశ్వనాథ్ చెప్పారు.
కట్ చేస్తే.. ఈ సినిమాను ఒప్పుకోక పోవడం వెనుక.. కారణాన్ని.. తన సన్నిహితులైన కృష్ణ, చిరంజీవితో శోభన్‌బాబు పంచుకు న్నారనితర్వాత సినిమా నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు తెలిసిందట. అప్పటికి మహిళా సెంటిమెంటు ఉన్న పాత్రలు చేస్తున్న శోభన్‌బాబు.. 50 ఏళ్ల పైబడిన కథానాయకుడిగా నటించేందుకు ఇష్టపడలేదని.. పైగా సంగీతం అంతగా తెలియని తనకు ఇలాంటి పాత్రలు వేస్తే.. అభిమానులు హర్ట్ అవుతారని కూడా వ్యాఖ్యానించారట. అంతేకాదు.. ఈ సినిమా ఎలానూ సక్సెస్ కాదని శోభన్‌బాబు నిర్ణయించేసినట్టు ఏడిదకు తెలిసిందట. ఇదే కారణంతో శోభన్‌బాబు సినిమా నుంచి తప్పుకొని ఉంటారని వ్యాఖ్యానించారు.
అయితే.. సినిమా 100 రోజుల ఫంక్షన్ జరిగినప్పుడు.. అనుకోకుండా.. విశ్వనాథ్‌గారు.. శోభన్‌బాబుకు కూడా కబురు పెట్టారట. దీనికి శోభన్‌బాబు, చిరంజీవి, కృష్ణ తదితర అగ్రతారలంగా వచ్చారు. ఈ సమయంలో శోబన్‌బాబు మాట్లాడుతూ.. సినిమాలు ఒప్పుకోకపోవడం.. ఒప్పుకోవడం వంటివి పక్కనపెడితే.. నా అంచనాలు మించి.. సినిమా హిట్టయినందుకు ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారట. ఇదీ..సంగతి!