Moviesబ్రేక‌ప్ జంట‌ మలైకా - ఆరోరా ఏం చేస్తున్నారో చూడండి (...

బ్రేక‌ప్ జంట‌ మలైకా – ఆరోరా ఏం చేస్తున్నారో చూడండి ( వీడియో )

బాలీవుడ్ ప్రేమ పక్షులు అర్జున్ కపూర్ – మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొద్దిరోజులుగా అర్జున్ కపూర్ తన ప్రేయసి మలైక అరోరాకి దూరంగా ఉంటున్నాడు అంటూ ఒకటే ప్రచారం జరిగింది. జాతీయ మీడియాలోను దీనిపై ఒకటే వార్తలు వచ్చాయి. దీంతో మలైకా – అర్జున్ కపూర్ విడిపోతున్నారు అంటూ ఒక్కటే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇవన్నీ పచ్చి అబద్ధాలు అని తేల్చి చెప్పింది ఈ జంట.

తాజాగా అర్జున్ – మలైకా కలిసి కనిపించారు. ముంబై బాంద్రా లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి వీరిద్దరూ బయటకు వస్తున్న విజువల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. పైగా ఈ విజువల్స్ లో ఈ ఇద్దరు చాలా క్లోజ్ గా కనిపించారు. అర్జున్ కపూర్ మరో హీరోయిన్ తో ప్రేమలో పడడంతో మలైకా అతడికి బ్రేకప్ చెప్పేసింది అని.. అందుకే సోషల్ మీడియాలో కూడా రకరకాల అర్థాలు వచ్చేలా ఆమె పోస్టులు పెడుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పడినట్లు అయింది.

ఇక అర్జున్ భర్తకు విడాకులు ఇచ్చేసిన ఓ హీరోయిన్ తో కొత్త డేటింగ్ మొదలు పెట్టాడంటూ గత వారం రోజులుగా వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ కలిసి చట్టాపట్టాలేసుకొని కనిపించడంతో ఈ బ్రేకప్ పై రూమర్లకు తెరపడినట్లు అయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news