Moviesబాల‌య్య ఫ్యాన్స్‌ను అన‌వ‌స‌రంగా కెలుకుతోన్న చిరు ఫ్యాన్స్‌…!

బాల‌య్య ఫ్యాన్స్‌ను అన‌వ‌స‌రంగా కెలుకుతోన్న చిరు ఫ్యాన్స్‌…!

చిరంజీవి – బాలయ్య అభిమానుల మధ్య యుద్ధాలు కొత్త ఏం కాదు. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు చాలాసార్లు బాక్సాఫీస్ బరిలో పోటీపడ్డారు. ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా వీళ్ళ అభిమానులు మాత్రం ఎప్పుడు తమ హీరో పై చేయి సాధించాలని పెద్ద యుద్ధాలు చేసుకుంటారు. తాజాగా రామ్ స్కంధ‌ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్య హాజరయ్యారు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్. ఫంక్షన్ లో బాలయ్య ఆమెను ప్రేమ పూర్వకంగా తలపై చేయి వేసి ఆశీర్వదించారు.

బాలయ్య ఇలా చేయడం వెనక ఒక రీజ‌న్ కూడా ఉంది. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న భగవంత్‌ కేసరి సినిమాలో శ్రీలీల బాలయ్యకు కూతురు పాత్రలో కనిపించింది. ఆ వాత్సల్యంతోనే బాలయ్య అలా ఆమె తలపై చేయి వేసి ఆశీర్వదించారు. అయితే ఈ ఫోటోను పట్టుకుని కొందరు చిరంజీవి అభిమానులు బాలయ్యను ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.

అయితే రీసెంట్గా భోళాశంకర్ సినిమా చేశారు చిరంజీవి. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటించింది. తన కూతురు కంటే తక్కువ వయసు ఉన్న కీర్తి సురేష్‌ను చిరంజీవి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఓ సందర్భంలో కీర్తి సురేష్ చేతిని తన చంకలో పెట్టుకున్నారు.. చిరంజీవి ఇవన్నీ ఆప్యాయంగానే చేసి ఉండొచ్చు.

అయితే ఇప్పుడు చిరు అభిమానులు బాలయ్య అభిమానులను అనవసరంగా కెలకడంతో బాలయ్య ఫ్యాన్స్‌కు కౌంట‌ర్లు ఇవ్వ‌డం మొదలు పెట్టారు. త‌మ హీరో ఆప్యాయంగా తలపై చేయి వేసి శ్రీలీలను ఆశీర్వదిస్తే చిరంజీవి వెకిలి చేష్టలు చేయటం కరెక్టేనా ? అంటూ బాలయ్య అభిమానులు చిరంజీవి అభిమానులకు కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా ఇద్దరి హీరోల అభిమానుల మధ్య యుద్ధాలు ఇప్పట్లో ఆగేలా లేవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news