Newsహీరో ' విశ్వ‌క్‌సేన్‌ ' కు కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్ చాలా...

హీరో ‘ విశ్వ‌క్‌సేన్‌ ‘ కు కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్ చాలా గ‌ట్టిదే…!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ పెళ్లికి రెడీ అయినట్టు తెలుస్తోంది. యూత్ లో మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న ఈ హీరో తన ఇన్‌స్టాల్ పోస్ట్ పెట్టారు. నాపై ప్రేమ చూపించే అభిమానులకు శ్రేయోభిలాషులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. నా జీవితంలో మరో ఘట్టాన్ని తాను ప్రారంభించబోతున్నాను.. సరికొత్త బంధం లోకి అడుగుపెట్టబోతున్నాను.

ఓ ఫ్యామిలీని స్టార్ట్ చేయబోతున్నాను.. అన్ని వివరాలు ఆగస్టు 15న తెలియజేస్తున్నాను అంటూ విశ్వక్సేన్ తన పోస్టులో పేర్కొన్నాడు. విశ్వక్సేన్ చేసిన ఈ పోస్ట్ ను బట్టి ఆయన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని అర్థమవుతుంది. తాను త్వరలోనే ఫ్యామిలీని ప్రారంభించబోతున్నాను అని చెప్పడం ద్వారా తాను త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాను అన్న విషయంలో క్లారిటీ ఇవ్వకనే ఇచ్చినట్లయింది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం హైదరాబాదులోని ఓ ప్రముఖ కన్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీ ఓనర్ కుమార్తెతో విశ్వక్‌సేను పెళ్లి ఖాయం అయినట్టు తెలుస్తోంది. పైగా ఆమె విశ్వక్‌సేన్ కి స్కూలు ఫ్రెండ్ అని.. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని.. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా అంగీకారం తెలిపాయి అని తెలుస్తోంది. అయితే విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక విశ్వ‌క్‌సేన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news