కోలీవుడ్ సీనియర్ హీరో విశాల్ వయసు 40 ఏళ్లు దాటేసిన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. విశాల్ పెళ్లి ఎప్పుడు ? వార్తల్లో ఉంటూ వస్తుంది. టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి.. కోలీవుడ్‌లో విశాల్ పెళ్లి ఎప్పుడు ? జరుగుతాయో ఎవరికీ తెలియటానికి పరిస్థితి. గతంలో విశాల్ కు హైదరాబాద్ కు చెందిన ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలో పెళ్లి జరుగుతుంది.. అనుకుంటున్న టైంలో వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. అంతకుముందు కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ – విశాల్ ప్రేమలో ఉన్నారని.. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది.
వీరిద్దరు పెళ్లిపై ఎన్ని వార్తలు ? వచ్చిన విశాల్ – వరలక్ష్మి మాత్రం తామిద్దరం మంచి స్నేహితులు అంటూ చెప్పారే తప్ప పెళ్లి గురించి ఏనాడు ఓపెన్ అవలేదు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఒకనాటి హీరోయిన్ తో విశాల్ పెళ్లి జరగబోతుందంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు లక్ష్మీ మీనన్. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో వచ్చిన కుమ్మ్కీ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన లక్ష్మి జిగర్తండా – కుట్టిబులి – పాండియనాడు ( తెలుగులో పల్నాడు) కొమన్ లాంటి సినిమాల్లో నటించింది.
ఈ సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అలాగే తెలుగులో వస్తున్న భోళాశంకర్ ఒరిజినల్ అజిత్ వేదాళం సినిమాలో అజిత్ కి చెల్లిగా కూడా లక్ష్మి నటించింది. వేదాళం తర్వాత లక్ష్మికి చాలా రోజులపాటు అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఆమె చంద్రముఖి 2 సినిమాలో నటిస్తోంది. 27 ఏళ్ల లక్ష్మీ మీనన్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందన్న ప్రచారం తమిళనాడు జరుగుతోంది. నటుడు విశాల్‌తోనే ఆమె పెళ్లి జరగబోతుందని కోలీవుడ్ కోడై కూస్తోంది.
ప్రస్తుతం ఇంటర్నెట్ అంతా విశాల్ – లక్ష్మీ మీనన్ పెళ్లి వార్తలతో షేక్ అవుతుంది. మరి వీరిద్దరూ కలిసి గతంలో పల్నాడు, ఇంద్రుడు వంటి సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాల్లో విశాల్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా కుదిరిందని.. వీరిద్దరి మధ్య పాత స్నేహం అలా కంటిన్యూ అవుతూ ప్రేమగా మారిందని తెలుస్తోంది. దీనిపై వీరిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.