టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కు తెలుగు ప్రేక్షకుల్లో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. విజయ్ దేవరకొండ మాట తీరు… బిహేవియర్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా అదిరిపోతుంది. వీటికి కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. నిన్న ఖుషి మ్యూజిక్ ఈవెంట్లో విజయ్ – సమంత పెర్ఫామెన్స్ తో యువతను ఎంతలా ఉర్రూతలూగించారో చూశాం. స్టేజ్ మీద వీరిద్దరూ కలిసి రొమాంటిక్‌గా రెచ్చిపోయారు.
సమంత అయితే విజయ్ కౌగిలిలో బందీ అయిపోవడంతో పాటు ఏకంగా విజయ్ ఆమెను ఎత్తుకుని గిరగిరా తిప్పేశారు. నిజం చెప్పాలంటే ప్రేమికుల్లా వీరిద్దరూ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఈ క్రమంలోనే ఈ ఈవెంట్లో విజయ్‌తో పాటు సమంత ఇద్దరూ వేసుకున్న డ్రెస్సుల మీద నెటిజన్ల లుక్కు పడింది. ఇక విజయ్ గ్రాండ్ లుక్ అయితే సింపుల్ గా ఉంది.
ఈ హీరో ధరించిన డిఫరెంట్ స్టైల్ అవుట్ ఫిట్ వైట్ కలర్ డ్రెస్ అభిమానులనే కాకుండా ఫ్యాషన్ ప్రియులకు కూడా బాగా నచ్చిందట. సోషల్ మీడియాలో ఈ డ్రెస్ పై కామెంట్లు మామూలుగా లేవు. ఈ రౌడీ హీరో ధరించిన ఈ అవుట్ ఫిట్ ధర అక్షరాల రెండు లక్షలు ఉంటుందని తెలుస్తోంది. దీని గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో బాగా సెర్చ్‌చేసి దీని రేటు రెండు లక్షలు అంటూ డిసైడ్ చేశారు.
ఇక స్టేజ్ మీద లైవ్ ఈవెంట్లో విజయ్ తాను వేసుకున్న డ్రెస్ విప్పేసి మరి సమంతతో రొమాంటిక్ పెర్ఫార్మన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఖుషి సినిమా సెప్టెంబర్ 1న థియేటర్లలోకి వస్తోన్న సంగతి తెలిసిందే.