Moviesసౌందర్యకి ఆ తెలుగు హీరో అంటే అంత కోపమా..? చనిపోయే వరకు...

సౌందర్యకి ఆ తెలుగు హీరో అంటే అంత కోపమా..? చనిపోయే వరకు కూడా మాట్లాడలేదా..? అంతలా బాధపెట్టాడా..?

సినిమా ఇండస్ట్రీలో మహానటి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు అలనాటి నటి సావిత్రి. ఆమె అందం.. ఆమె నటన ..అభినయం ముందు ఎవరు పనికిరారు అని చెప్పాలి . ఆ తర్వాత అలాంటి క్రేజీ స్థానం అందుకుంది మాత్రం సౌందర్య అనే చెప్పాలి . చాలా చిన్న ఏజ్ లోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకున్న సౌందర్య ఇండస్ట్రీలోకి ఎంత త్వరగా వచ్చిందో అంతే త్వరగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది .

తెలుగు – కన్నడ – ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకున్న హీరోయిన్ సౌందర్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఇప్పటికే ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ .. ఆమె సినిమాల ద్వారా అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది . కాగా సౌందర్య చాలామంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నింది. ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న సౌందర్య ఓ హీరోతో మాత్రం అవకాశం వచ్చిన స్క్రీన్ షేర్ చేసుకోలేదు .

అంతేకాదు ఆ హీరో సౌందర్యతో నటించాలని ఆమెతో స్టెప్స్ వేయాలని ఏకంగా ఆరు సినిమాలకు ట్రై చేశారట. ఆశ్చర్యం ఏంటంటే సౌందర్య ఏ ఒక్క సినిమాకి ఆయనతో నటించడానికి ఒప్పుకోలేదు. దానికి కారణం ఆయనకు అమ్మాయిల పిచ్చి ఉండడమే అంటూ ఆలస్యంగా తెలిసింది. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణమే . అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్లలో సౌందర్య కూడా ఒకరు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అయితే సదరు స్టార్ హీరో సౌందర్యతో వెటకారంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారట. అప్పటినుంచి సౌందర్యకు ఆ హీరో అంటే ఓ బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయిందని.. అందుకే ఆయన సినిమాలో అవకాశం వచ్చిన రెమ్యూనరేషన్ హై ఇస్తామని చెప్పినా.. సౌందర్య ఆయన సినిమాలో నటించనేలేదు అంటూ అప్పట్లో జనాలు చెప్పుకొచ్చారు. అంతేకాదు అప్పట్లో సౌందర్య తీసుకున్న డెసిషన్ ఆమె అభిమానులను చాలా ఆకట్టుకునింది . ఇండస్ట్రీకి సౌందర్య లాంటి హీరోయిన్ ఉండాలి అంటూ తెగ పొగిడేసారు . కానీ ఆమె తిరిగి రాని లోకాలకు చేరిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news