Movies"ఖుషి" ట్రైలర్: లవర్స్ భార్య భర్తలు అయితే ఇట్లే ఉంటాది.. మరో...

“ఖుషి” ట్రైలర్: లవర్స్ భార్య భర్తలు అయితే ఇట్లే ఉంటాది.. మరో సాలిడ్ హిట్ కొట్టేశావ్ పో రా రౌడి హీరో..(వీడియో)!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత నటిస్తున్న తాజా సినిమా ఖుషి . శివనిర్వాణ లాంటి మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా మొదటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది . అంతేకాదు అభిమానులను తెగ ఆకట్టుకునింది . సెప్టెంబర్ 1 న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది .

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొద్దిసేపటికి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. కాగ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో అట్రాక్టివ్ గా చాలా రియలిస్టిక్ గా కట్ చేశాడు డైరెక్టర్ . అంతేకాదు ఈ సినిమా మొత్తం ఫుల్ టు ఫుల్ రొమాంటిక్ ఎంటటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. ఒక రెండు వేరువేరు ప్రపంచంలో పెరిగిన వ్యక్తులు ప్రేమించి పెళ్లి చేసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఈ సినిమాలో క్లియర్ కట్ గా చూపించారు డైరెక్టర్.

అంతేకాదు ఈ సినిమాలో విజయ్ దేవరకొండను మనం మరో గీతాగోవిందం సినిమాలోని విజయ్ దేవరకొండను చూడొచ్చు అంటూ ట్రైలర్ తో తెలిసిపోతుంది. సమంత లుక్స్ కూడా సేమ్ టు సేమ్ మజిలీ సినిమా లుక్స్ లు కాపీ కొట్టేశాడు డైరెక్టర్. అంతే కాదు వీళ్ళ మధ్య వచ్చే ఫన్నీ డైలాగ్స్ సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నాయి అంటూ ట్రైలర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది . కాగా ఈ సినిమాతో మరొక క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమైపోయాడు విజయ్ దేవరకొండ . కచ్చితంగా నేటి జనరేషన్ లో ఉండే వైఫ్ అండ్ హస్బెండ్ ఈ సినిమాను తప్పకుండా చూసి ఒక మెసేజ్ తీసుకునే విధంగానే తెరకెక్కించాడు శివనిర్వాణ. ప్రజెంట్ ఖుషి సినిమా ట్రైలర్ నెట్టింట్లో వైరల్ గా మారింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత అటు సమంత ఇటు విజయ్ దేవరకొండ క్రేజీ హిట్లను తమ ఖాతాలో వేసుకోబోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news