Moviesమహేష్ కు భార్య వెరీ వెరీ స్పెషల్ బర్త్ డే విషెష్..నమ్రత...

మహేష్ కు భార్య వెరీ వెరీ స్పెషల్ బర్త్ డే విషెష్..నమ్రత మేడమ్ టూ రొమాటిక్ రా బాబోయ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్న మహేష్ – నమ్రతల జంట ముందు ఎవరు సాటి రారు అనే చెప్పాలి . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంత అన్యోన్యంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని కొన్ని సార్లు వీళ్లను చూస్తుంటే కొన్ని జంటలకి కుళ్ళు అసూయ పుడుతూ ఉంటుంది . అంత చక్కగా హెల్తీగా అన్యోన్యంగా ఉంటారు మహేష్ బాబు – నమ్రత. అంతే కాదు వీళ్ళని చూస్తే అసలు వీళ్ళ మధ్య గొడవలు రావా ..? భార్యాభర్తలు ఇంత హ్యాపీగా కూడా ఉంటారా..? అనే అంతలా వీళ్ళు కలిసి ఉంటారు .

కాగా నేడు మహేష్ బాబు పుట్టినరోజు. ఈ క్రమంలోనే ఆయన తన 48వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో సినిమా స్టార్స్ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సన్నిహితులు అందరూ ఆయనకు పెద్ద ఎత్తున విష్ చేస్తున్నారు. అయితే ఎంతమంది ఎన్ని రకాలుగా విష్ చేసిన ఆయన లైఫ్ లోనే మోస్ట్ స్పెషల్ పర్సన్ మరింత స్పెషల్ గా విష్ చేస్తే ఆ కిక్కు వేరేగా ఉంటుంది .

ప్రజెంట్ అలాంటి కిక్ ని ఇచ్చింది మహేష్ బాబు భార్య నమ్రత . మహేష్ బాబు భార్య నమ్రత మహేష్ కి స్పెషల్గా విష్ చేసింది . తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఇంస్టాగ్రామ్ వేదికగా మహేష్ బాబుకు “Happy Birthday MB.. ఇప్పుడు ..ఎప్పుడు.. ఎప్పటికీ నువ్వే నువ్వే ” అంటూ తనతో క్లోజ్ గా దిగిన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో మహేష్ ని వెనకనుంచి నమ్రత ఎంతో ప్రేమగా హద్దుకొని ముద్దాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . అంతేకాదు ఈ ఫోటోకు చాలా లైక్స్ రావడం కూడా గమనార్హం . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news