టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ. అంతకుముందు పలు సినిమాలో నటించిన రాని గుర్తింపు పెళ్లి చూపులు సినిమాతో వచ్చింది . ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా మారాడు . అయితే ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి మాత్రం ఆయన జాతకాన్నే మార్చేసింది . అప్పటివరకు హీరోగా స్టార్ హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ ఇండస్ట్రీని ఏలేసే సూపర్ డూపర్ హీరోగా మారిపోయాడు. ఎంతలా అంటే బాలీవుడ్ జనాలు సైతం విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి తెగ ఇంట్రెస్ట్ చూపించి కోట్లకు కోట్లు పారితోషికం ఆఫర్ చేసింది.
కానీ కథ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే విజయ్ తన మనసుకు నచ్చిన కథలను చూస్ చేసుకుంటూ వచ్చాడు . ప్రజెంట్ విజయ్ దేవరకొండ సమంత సరసన ఖుషి అనే సినిమాలో నటించాడు . సెప్టెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కాగా ఆ తర్వాత గౌతమ్ తిన్నూరు దర్శకత్వంలో ఓ సినిమాకి ..పరశురాంపెట్ల దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు విజయ్ దేవరకొండ . ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ కి సంబంధించిన పెళ్లి వార్త వైరల్ గా మారింది.
రీసెంట్గా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ కి తన పెళ్లిపై ప్రశ్న ఎదురైంది . ‘మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా..? లేక అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా..?” అంటూ యాంకర్ ప్రశ్నించగా .. దానికి విజయ్ స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చాడు . లవ్ మ్యారేజ్..? లేదా అరేంజ్డ్ మ్యారేజ్..? ఏదో ఒకటి చేసుకోవాలి కదా..? నాకు ఆల్రెడీ చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ మా పేరెంట్స్ ఏది డిసైడ్ చేస్తారు నేను అదే ఫైనలైజ్ చేస్తాను. అదే ఫాలో అవుతాను” అంటూ క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ఇప్పుడు విజయ్ దేవరకొండ మాటలు బట్టి ఆయన కచ్చితంగా తన తల్లిదండ్రులు చెప్పిన సంబంధమే చేసుకుంటారు అంటున్నారు ఫ్రెండ్స్. మరి రష్మిక మందన పరిస్థితి ఏంటి ..? అనేది అభిమానులకు మిలియన్ డాలర్స్ ప్రశ్న గా మిగిలిపోయింది..!!