టాలీవుడ్ రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా నటించిన సినిమా ఖుషి . శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ సమంత నటించింది. ఫుల్ టు ఫుల్ లవ్ – రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్.
తమిళ్ వర్షన్ లో ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు చెన్నైలో ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు ఖుషి టీం. ఈ మీడియా సమావేశంలో రిపోర్టర్స్ పలు విధాలుగా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండకు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన క్వశచన్ ఎదురైంది. ” మీరు రష్మిక మందన్నాతో కలిసి మళ్ళీ ఎప్పుడు నటిస్తారు ..? మీ కాంబో తెరపై సూపర్ సక్సెస్ అయ్యింది కదా ..?అని ప్రశ్నించగా ..విజయ్ దేవరకొండ స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చారు .
“నాకు రష్మిక మందన్నాతో నటించాలని ఉంది. కానీ తెరపై మా ఇద్దరినీ కలిపి చూపించడానికి డైరెక్టర్లు రెడీగా లేరు “అంటూ చాలా బోల్ట్ గా ఆన్సర్ ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో ఇవే కామెంట్స్ వైరల్ గా మారాయి . అంతేకాదు ఎందుకు విజయ్ దేవరకొండ ఇలాంటి ఆన్సర్ ఇచ్చాడు..? గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో నిజంగానే వీళ్ల మధ్య బ్రేకప్ జరిగిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే తెరపై ఒకే జంటను చూసి చూసి బోర్ కొట్టేస్తుందని అందుకే విజయ్ దేవరకొండ రూట్ మార్చడని చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి దీనిపై రష్మిక ఏ విధంగా స్పందిస్తుందో..?