Newsడిజాస్ట‌ర్ ' భోళాశంక‌ర్ ' ... టాప్ 12 ట్రోల్స్ చూశారా......

డిజాస్ట‌ర్ ‘ భోళాశంక‌ర్ ‘ … టాప్ 12 ట్రోల్స్ చూశారా… ఇవి చూస్తే త‌ల ఎక్క‌డ పెట్టుకుంటారో..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భోళాశంక‌ర్ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ అంచ‌నాల‌తో రిలీజ్ అయ్యింది. అయితే సినిమాపై ముందు నుంచి చాలా సందేహాలు ఉన్నాయి. త‌మిళంలో ఎప్పుడో 2015లో అజిత్ చేసిన వేదాళం సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా వ‌చ్చింది. పైగా శ‌క్తి, షాడో లాంటి డిజాస్ట‌ర్ సినిమాల త‌ర్వాత ప‌దేళ్ల పాటు మెగా ఫోన్ ప‌ట్ట‌ని ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ తీసిన సినిమా ఇది.

ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. సినిమాకు యునాన‌మ‌స్‌గా డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చింది. క‌నీసం చిరంజీవి వీరాభిమానుల‌కే ఈ సినిమా న‌చ్చ‌లేదు. ఇక సోష‌ల్ మీడియాలో ఈ సినిమా ట్రోలింగ్ మామూలుగా న‌డ‌వ‌డం లేదు. ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్నారు. నిజంగా ఇవి చూస్తే ఈ సినిమా మేక‌ర్స్ త‌ల‌లు ఎక్క‌డ పెట్టుకుంటారో అన్నంత ఘాటుగా ఉన్నాయి. సోష‌ల్ మీడియాలో భోళాశంక‌ర్ ప్లాప్‌పై జ‌రుగుతోన్న ట్రోలింగ్ ప‌దాల‌ను ఓ సారి చూద్దాం.

1- బోలో బోలో శంక‌ర్‌
2- బోల్తా శంక‌రుడు
3- బేకార్ శంక‌ర్‌
4- భోళా జీ క్యాజీ
5- భోళాశంక‌ర్ పాత రీమేక్ ప‌చ్చ‌డి
6- బోల్తా ప‌డ్డ శంక‌ర్‌
7- భోరుమ‌న్న శంక‌ర్ – బావురు మంటోన్న ఫ్యాన్స్‌
8- మెహ‌ర్ రాడ్డేష్ కం బ్యాక్ మూవీ
9- చిరు మ‌రో రీ మేకు ఈ భోళాశంక‌ర్‌
10- కామెడీ కూడా వెగ‌టుగానే ఉందోయ్ శంక‌రా
11- హర హర మహదేవా ఇదేం సినిమా
12- భోళాశంక‌ర్ చూడాలంటే జండూబామ్ ఉండాల్సిందే

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news