Moviesతెలుగు బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే… క‌మెడియ‌న్ల నుంచి హీరోలు...

తెలుగు బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే… క‌మెడియ‌న్ల నుంచి హీరోలు కూడా…!

తెలుగు బిగ్ బాస్ ఏడవ సీజన్ సెప్టెంబర్ 3న గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఈసారి కూడా టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించినన్నాడు. ఈసారి బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టేది ఎవరు? ఎవరెవరు పేర్లు సోషల్ మీడియాలో మారుమూగుతున్నాయి… ఎంతమంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్సులు ఉన్నాయి అన్నది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.

విశ్వస‌నీయ వర్గాల సమాచారం ప్రకారం నటుడు అమరదీప్ – మై విలేజ్ షో యూట్యూబ‌ర్ అనిల్ జీల – నటి అంజలి పవన్ – కొరియోగ్రాఫర్ ఆట సందీప్ – నటి పూజా మూర్తి – మోడల్ నటుడు ప్రిన్స్ యావర్ – యూట్యూబ‌ర్‌ రంగస్థలం నటుడు మహేష్ – కార్తిక దీపం శోభా శెట్టి – సింగర్ దామిని – మొగలిరేకులు హీరో సాగర్ – జబర్దస్త్ కమెడియన్ టేస్టీ తేజ – హీరో గౌతమ్ కృష్ణ – కెవ్వు కార్తీక్ – బోలే షావలి – హీరోయిన్, కొరియోగ్రాఫర్ పర్జానా – నటుడు క్రాంతి దాదాపు కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది.

ఇక యాంకర్ ప్రత్యూష పేరు గత సీజన్లోని వినిపించింది. అయితే ఈసారి ఆమె పేరు ఫైనల్ అయ్యే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి ప్రియాంక జైన్ పేరు పెద్దగా ప్రచారంలో లేకపోయినా చివర్లో మాత్రం ఆమె పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రియాజ్, జబర్దస్త్ నరేష్ లలో ఎవరో ఒకరు ఉండే ఛాన్సులు ఉన్నాయి.

బుల్లెట్ భాస్కర్ – షకీలా – అబ్బాస్ – హీరోయిన్ శుభశ్రీ – రాయగురు ప్రభాకర్ తో కూడా బిగ్ బాస్ టీం సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఇక యూట్యూబ‌ర్‌ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా చాలా వీడియోలు చేశాడు. బిగ్ బాస్ కు వెళ్లాలని ఉందని ఎన్నోసార్లు చెప్పినా అతడు కూడా షో లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఇక వీరిలో కొందరిని వైల్డ్ కార్డు కోసం పక్కన పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news