Moviesమహేశ్-సాయి పల్లవిలో ఉన్న కామన్ పాయింట్ ఇదే.. అందుకే జనాలు నెత్తిన...

మహేశ్-సాయి పల్లవిలో ఉన్న కామన్ పాయింట్ ఇదే.. అందుకే జనాలు నెత్తిన పెట్టుకుంటున్నారు తెలుసా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబుకి ఎలాంటి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే. సూపర్ స్టార్ హీరో కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఏనాడు తన తండ్రి పేరుని పబ్లిసిటీని క్రేజీని వాడుకోలేదు . తన సొంత టాలెంట్తో ఇంతవరకు వచ్చారు . అయితే ఇన్నేళ్ల తన సినీ కెరియర్లో మహేష్ బాబు ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క రీమిక్స్ చిత్రంలో నటించకపోవడం గమనార్హం.

ఎవరైనా ఇంటర్వ్యూలు అడిగితే మాత్రం మహేష్ బాబు ఓపెన్ గా చెప్పుకొచేస్తాడు . “రీమిక్స్ సినిమా అంటేనే ఆల్రెడీ ఒక కథలో ఒక హీరో నటించేసి జనాలు చూసేస్తారు.. మరి అదే కథను తెరపై మరోసారి నేను చూపిస్తే ఏం బాగుంటుంది ..?అందుకే నేను రీమిక్స్ సినిమాలు చేయను ..? అంటూ చెప్పుకువచ్చారు”. అయితే ఇదే విధంగా హీరోయిన్ సాయి పల్లవి సైతం రీమిక్స్ సినిమాలో విషయంలో చెప్పుకొస్తుందట .

తన వద్దకు వచ్చిన ఏ డైరెక్టర్ కైనా సరే రీమిక్స్ సినిమా తీసుకొస్తే చచ్చిన చేయను అంటూ ముఖం మీద చెప్పేస్తుందట . “ఆల్రెడీ ఒకరు తీసేసిన సినిమాలో నేను నటించడం ఏంటి..? ఆ ప్లేస్ లో ఆల్రెడీ ఒక వ్యక్తి నటించేసి ఉంటారు..? అదే పాత్రలో నేను నటించగలనా ..? నటిస్తే మెప్పించగలనా..? అంటూ సాయి పల్లవి రీమిక్స్ సినిమాలు రిజెక్ట్ చేస్తూ వస్తుందట”. రీసెంట్గా రిలీజ్ అయిన భోళా శంకర్ సినిమా అదే కారణంతో రిజెక్ట్ చేసింది సాయి పల్లవి అని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయంలో ఇద్దరి క్వాలిటీస్ బాగా మ్యాచ్ అయ్యాయని ..ఈ ఇద్దరు తెర పై కనిపిస్తే చూడాలి అనేది మహేష్ బాబు – సాయి పల్లవి అభిమానుల కోరిక . చూద్దాం మరి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news