Moviesమెగాస్టార్ ' చూడాల‌ని ఉంది ' సినిమాకు ఫ‌స్ట్ అనుకున్న 2...

మెగాస్టార్ ‘ చూడాల‌ని ఉంది ‘ సినిమాకు ఫ‌స్ట్ అనుకున్న 2 టైటిల్స్ ఇవే…!

మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చూడాలని ఉంది 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సౌందర్య – అంజలా జవేరి హీరోయిన్లుగా, ప్రకాష్ తెలంగాణ నటించిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ బ్యాన‌ర్ పై చలసాని అశ్వినీద‌త్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆ రోజుల్లోనే రు. 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతోపాటు 62 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది.

తాజాగా ఈ సినిమా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సినిమాకు ముందుగా కాళిక అంటే కలకత్తా కాలిక ( కాళీ దేవత ) అన్న టైటిల్ అనుకున్నామని తెలిపారు. అయితే చూడాలని ఉంది లాంటి సాఫ్ట్ టైటిల్ చిరంజీవి లాంటి మాస్ హీరోకు ఎలా యాఫ్ట్‌ అవుతుందని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా ఆ టైటిల్ చిరంజీవియే సూచించారని గుణశేఖర్ వెల్లడించారు.

ఈ సినిమా క్లాస్ టచ్‌తో కూడిన యాక్షన్ సినిమా కావ‌డంతో సొగసు చూడ త‌రమా వంటి టైటిల్‌ని పెట్టాలని కూడా అనుకున్నాం. చూడాలని ఉంది టైటిల్ అయితే బాగుంటుందా అని చిరు గారు నన్ను అడిగార‌ని… నేను మెగాస్టార్ ఇమేజ్‌కి ఆ టైటిల్ సరిపోదేమో అని కంగారు పడినా అంద‌రూ డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని చెప్ప‌డంతో చివ‌ర‌కు ఆ టైటిల్ పెట్టిన‌ట్టు చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news