మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దమ్ము ఎంతో మరోసారి బయటపడింది. తాజాగా బోయపాటి బాలయ్యతో తెరకెక్కించిన అఖండ లాంటి ఊరమాస్ హిట్ సినిమా తర్వాత రామ్‌తో స్కంద సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 15న వినాయక చవితి సీజన్ టార్గెట్ చేస్తూ థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో బోయపాటి శ్రీను స్టైల్ ఆఫ్ మాస్ కనిపించింది.
తెర నిండుగా ఆర్టిస్టులు ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. స్కంద సినిమాకు ఎంత ?బడ్జెట్ అయింది అనేది పక్కన పెడితే నాన్ థియేటర్ రైట్స్ ద్వారా నిర్మాత శ్రీనివాస్ చిట్టూరికి గట్టిగా గిట్టుబాటు అయింది. సుమారు 98 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చిందని తెలుస్తోంది. స్కంద సౌత్ లాంగ్వేజెస్ – శాటిలైట్ డిజిటల్ రైట్స్ – స్టార్ నెట్వర్క్ గ్రూప్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లు అన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతాయి. స్టార్ ఛానల్లో సినిమా టెలికాస్ట్ అవుతుంది. ఇక హిందీ వెర్షన్ ఓటిటి, శాటిలైట్ థియేటరికల్ రైట్స్ 35 కోట్లకు జి స్టూడియో తీసుకుంది. సినిమా నిర్మాణంలో జీ స్టూడియో కూడా భాగస్వామి అన్నది తెలిసిందే. ఆడియో రైట్స్ ద్వారా మరో 9 కోట్లు వచ్చాయి.
రిలీజ్ ముందే ఇంత అమౌంట్ రావడం రికార్డు. తెలుగు థియేటర్ రైట్స్ కూడా భారీరేట్లకు విక్రయించారు. థియేటర్ నుంచి దాదాపు రు. 50 కోట్ల వరకు సంపాదించారు. ఏది ఏమైనా బోయపాటి మాస్ దమ్ము ఎంతో ?స్కంద సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. రేపు సినిమాకు ఏమాత్రం హిట్టుటకు వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ ఊచకోత మోగిపోవాల్సిందే.