సాధారణంగా సినిమాలలో ఒక సినిమాకు ముందుగా అనుకున్న హీరో లేదా హీరోయిన్ లేదా దర్శకుడు మారుతూ ఉంటారు. ముందుగా ఒక హీరోతో సినిమా అనుకొని సడన్గా హీరోను మార్చేసి మరో హీరోతో అదే కథతో సినిమా తెరకెక్కిస్తారు. అలాగే ఒక సినిమాలో ఒక హీరోయిన్ ను ముందుగా అనుకుని.. కథలో మార్పులు చేర్పులు చేశాక సడన్గా ఆ హీరోయిన్ ప్లేస్ లో మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చేస్తుంది అయితే ఇలా చాలామంది హీరోలు, హీరోయిన్లు, దర్శకులు కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అవుతూ ఉంటారు.
దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు కెరియర్ లో సూపర్ డూపర్ హిట్ సినిమా ప్రేమ్ నగర్. సురేష్ ప్రొడక్షన్స్ పై దివంగ లెజెండ్రీ నిర్మాత అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను ఆంధ్రదేశం అంతా విజయవాడకు చెందిన నవయుగ ఫిలిమ్స్ పంపిణీ చేసింది. అయితే ముందుగా ఒక రెడ్డి గారు ప్రేమనగర్ అనే టైటిల్ తో విక్టరీ మధుసూదన్ రావు దర్శకత్వంలో కేఆర్ విజయ హీరోయిన్ గా ఈ సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నారు.
కథతో పాటు షూటింగ్ కూడా కొంత జరిగింది. ఆ రెడ్డి గారికి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఆయన సడన్గా షూటింగ్ ఆపేశారు. అయితే దసరా బుల్లోడు సూపర్ హిట్ అయ్యాక ఏఎన్ఆర్ తో సినిమా చేయాలని రామానాయుడు నిర్ణయించుకున్నారు. ఈ విషయం ఏఎన్నార్‌కు చెబితే ఆయన సూచన మేరకే ప్రేమనగర్ సినిమా కథను తీసుకుని అప్పటివరకు షూటింగ్‌కు ఖర్చుపెట్టిన రెడ్డి గారికి కొంత అమౌంట్ ఇచ్చి దానిని రామానాయుడు టేకోవర్ చేశారు.
అలా ప్రేమనగర్ సినిమాలో హీరో, హీరోయిన్లతో పాటు దర్శకుడు కూడా మారిపోయారు. హీరోయిన్ గా కేర్ విజయ స్థానంలో వాణిశ్రీ రాగా… హీరోగా ఏఎన్నార్ ఎంట్రీ ఇచ్చారు. ఇక దర్శకుడుగా విక్టరీ మధుసూదన్ రావు ప్లేస్ లో కె ఎస్ ప్రకాష్ రావు వచ్చారు. రామానాయుడు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లోనే ఏడాది పాటు ఆడింది.