హాట్ బ్యూటీ శ్రీరెడ్డి ఎప్పుడు ఎవరో ఒకరిని ఆడిపోసుకోవటం.. కాంట్రవర్తిగా వార్తల్లో నిలవడం.. అందరితోనూ తిట్టించుకోవడం అలవాటుగా పెట్టుకున్నట్టు ఉంది. నిన్నటికి నిన్న భోళాశంకర్ ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చిరంజీవి కీర్తి సురేష్ తో క్లోజ్ గా మూ అవడాన్ని కూతురు వయస్సున్న అమ్మాయితో ఏంటీ ఈ కామకలాపాలు అంటూ విమర్శించిన శ్రీరెడ్డి ఈరోజు ఏపీ మంత్రి సీనియర్ సినీనటి రోజాపై సెన్సేషనల్ కామెంట్లు చేసింది.
గతంలో రోజా కాస్టింగ్ కౌచ్ అనేది లేదని వ్యాఖ్యలు చేసిందట. ఈ వ్యాఖ్యలకు శ్రీ రెడ్డి కౌంటర్ ఇవ్వడం విశేషం. రోజా సినిమా పరిశ్రమ లో 27 ఏళ్లు ఉందేమో.. అన్ని ఏళ్లలోనూ ఆమెను ఎవ్వరూ గెలక లేదు అంటే ఈ బ్యూటీ ఎవడికి నచ్చలేదేమో.. అయిన ఆ ముఖాన్ని ఎవడు గెలుకుతాడు.. అసలు కొంపదీసి ఈమెనే ఎవడినైనా గోకితే పట్టించుకోలేదేమో అంటూ శ్రీరెడ్డి రోజా పై దుమారం రేపే వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి రోజాపై చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
అయితే వైసీపీకి పాజిటివ్ గా మాట్లాడే శ్రీరెడ్డి సీఎం జగన్ అంటే పడి చచ్చిపోతూ ఉంటుంది. జగన్ ను ఎవరైనా విమర్శిస్తే వారికి కౌంటర్లు కూడా ఇస్తూ ఉంటుంది. అలాంటిది ఇటీవల శ్రీరెడ్డి వైసీపీ నేతలను కూడా టార్గెట్ చేస్తూ ఉండటం ఆమెలో మారిన పంథాకు నిదర్శనంగా నిలుస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.