Moviesహీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సింగర్ గీతామాధురి.. హీరో ఎవరంటే..?

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సింగర్ గీతామాధురి.. హీరో ఎవరంటే..?

సింగర్ గీతామాధురి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. హీరోయిన్ కి మించిపోయే అందం ఉన్న అమ్మడు.. పాటలు కూడా అంతే అద్భుతంగా పాడుతుంది. క్లాస్ – మాస్ – రొమాంటిక్ మెలోడీ అని తేడా లేకుండా ఎలాంటి పాటలు అయినా సరే అవలీలగా పడేసే గీతామాధురి టాలీవుడ్ హీరో నందుని ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఆ తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది . సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడు తన ఫొటోస్ తన క్రేజీ అప్డేట్స్ అందించే గీతామాధురి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది.

గీతామాధురి పాటలు కూడా పాడడం లేదు . అవకాశాలు రావడం లేదో లేక వచ్చిన ఆమె పాటలు పాడడం లేదో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో గీతామాధురి పాడిన పాటలే లేవు. అయితే రీసెంట్గా గీతామాధురి తనలోని మరో యాంగిల్ ని బయటపెట్టింది . అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న మోడ్రెన్ హాట్ ఫొటోస్ షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లో గీతామాధురి టూ హాట్ గా కనిపించడమే కాకుండా తన స్టైల్ మొత్తం మార్చేసింది.

దీంతో గీతామాధురి అవతారం చూస్తుంటే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాబోతుంది ఏమో అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు గతంలో గీతామాధురి పలు ఇంటర్వ్యూలలో రామ్ చరణ్ తన ఫేవరెట్ హీరో అని చెప్పుకొచ్చింది. తన కెరియర్ స్టార్ట్ అయింది రామ్ చరణ్ పాటతోనే అని చిరుత సినిమాలో చమక చమక్కిరే పాటతోనే ఆమె కెరియర్ స్టార్ట్ అయింది అని చెప్పుకొచ్చింది . అలా చూసుకుంటే రామ్ చరణ్ సినిమాలోని అమ్మడు కు ఏదైన అవకాశం ఇస్తాడు ఏమో..రామ్ చరణ్ సినిమాతోనే అమ్మడు సినిమా ఇండస్ట్రీలోకి వస్తుందేమో .. ఆ దేవుడు రాసిపెట్టి ఉంటే ఎవరు తప్పించగలరు అంటూ గీతామాధురి ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news