Moviesఇండియ‌న్ సినిమాకు షేకింగ్ న్యూస్‌… ' స‌లార్ ' ట్రైల‌ర్ రిలీజ్...

ఇండియ‌న్ సినిమాకు షేకింగ్ న్యూస్‌… ‘ స‌లార్ ‘ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోగా హీరోయిన్గా.. కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ పాండ్ ఇండియా సినిమా సలార్. రెండు భాగాలుగా భారీ స్థాయిలో తెర‌కెక్కిన ఈ సినిమాను హోంబ‌లే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరంగాదూర్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ అయి ఏకంగా 130 మిలియన్లకు పైగా న్యూస్ సొంతం చేసుకుని సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

అందరిలోనూ భారీ అంచనాలు ఉన్న సలార్ మూవీ థియేటర్ ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేక‌ర్స్‌. సెప్టెంబర్ 7న ట్రైలర్ గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నిజంగా సలార్ ట్రైలర్ రిలీజ్ అయిన రోజు ఇండియన్ సినిమా అంతా ఒక్కసారిగా షేక్ అవుతుంది అనటంలో సందేహం లేదు.

ఇక సలార్లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, జగపతిబాబు, ఈశ్వరి రావు, శ్రీయారెడ్డి కీలకపాత్రలు చేస్తూండగా కేజీఎఫ్ సీరిస్ సినిమాల‌కు సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీని పాన్ ఇండియా వైడ్‌గా సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news