కన్నడ బ్యూటీ రష్మిక మందన్న సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. శ్రీలీల రాకపోయి ఉంటే అసలు తెలుగులో ఆమెకు క్షణం కూడా తీరిక లేకుండా ఉండేది. ఎప్పుడు అయితే శ్రీలీల ఇక్కడ ఎంటర్ అయిందో రష్మికకు కాస్త క్రేజ్ తగ్గిందని చెప్పాలి. ప్రస్తుతం రష్మిక ముంబైకి మకాం మార్చేసింది. అయితే బన్నీకి జోడిగా నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం హైదరాబాద్ వచ్చి పోతుంది.
అటు కోలీవుడ్ లోనూ ఆమె ఓ బిగ్ ప్రాజెక్టుకు సైన్ చేసినట్టు తెలిసింది. కోలీవుడ్లో ఆమె తొలిసారిగా కార్తీ హీరోగా నటించిన సుల్తాన్ సినిమాలో నటించింది. ఆ తర్వాత విజయ్ సరసన వారసుడు సినిమాలో చేసింది. ఈ రెండు సినిమాలతోనే ఆమె తమిళనాట మంచి క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా వారసుడు సినిమాలో రంజితమే పాటలో రష్మిక లుక్, డ్యాన్స్ కు తమిళ జనాలు ఫిదా అయిపోయారు.
అయితే ఇప్పుడు ఆమె సీనియర్ హీరో విక్రమ్ కు జోడిగా మరో కోలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా డైరెక్టర్ ఎవరో కాదు జూడ్ ఆంటోనీ జోసెఫ్. మలయాళంలో వచ్చిన ‘2018’ అనే సినిమాతో స్టార్ డైరక్టర్ అయ్యాడు ఆంటోనీ. ఈ సినిమా మల్లూవుడ్ లో అత్యంత వేగంగా వంద కోట్ల రూపాయల వసూళ్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.
ఇక ఇప్పుడు విక్రమ్ హీరోగా పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తోన్న ఈ సినిమాకు రష్మికను హీరోయిన్గా అనుకుంటున్నారు. ఇక విక్రమ్ పక్కన రష్మిక హీరోయిన్ అంటే అమ్మడు క్రేజ్ అయిపోయిందా.. అప్పుడే ఈ ముసలి హీరో పక్కన నటించడమేంటని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఓ వైపు విక్రమ్ కొడుకు సినిమాలు చేస్తున్నాడు.. చేస్తే విక్రమ్ కొడుకు పక్కన చేయకుండా విక్రమ్ జోడీగా ఏంటమ్మా ? రష్మికమ్మా ? అని ప్రశ్నిస్తున్నారు.