బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్, దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు ఇటీవల బాగా కాంట్రవర్సీ మ్యాన్‌గా మారిపోయాడు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఈ క్రమంలోనే మరోసారి ఉమైర్ కాంట్రవర్సీ కామెంట్లతో రెచ్చిపోయడు. అందులోనూ సౌత్ సినీ ఇండస్ట్రీ యాక్టర్లను టార్గెట్ చేయడంతో ఉమైర్‌పై పలువురు సౌత్ సినీ అభిమానులు తీవ్రంగా మండి పడుతున్నారు.
సౌత్ సినీ ఇండస్ట్రీ హీరోలు బిగ్గెస్ట్ సెక్సువల్లీ ప్రిడేటర్స్ అంటూ కామెంట్ చేశాడు. 1980 – 90ల్లోనే కొందరు స్టార్ హీరోలు తమ సినిమాల్లో నటించిన కొందరు నటీమణులను ఇబ్బంది పెట్టాడంటూ సంచలన ఆరోపణలు చేశాడు. దక్షిణాది నటులు ఫీమేల్ యాక్టర్లను అస్సలు గౌరవించరని.. వారిని సె.. క్స్ డాల్స్‌లా చూస్తూ ఉంటారని.. ఈ విషయాలపై విచారణ జరపాలంటూ డిమాండ్ చేశాడు.
తెలుగు, తమిళ సినీ రంగంలో ఇలాంటి నటుల గురించి ఎక్స్‌ఫోజ్ చేసేందుకు తాను ముందు ఉంటానని ఉమైర్ చెప్పాడు. అయితే తెలుగు, తమిళ సినీ అభిమానులు మాత్రం నువ్వు ఈ చెత్త కామెంట్లు మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్‌లు ఇస్తున్నారు.