టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తాప్సి ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతుంది. ముఖ్యంగా తాప్సి సినిమాలు కంటే కూడా వ్యక్తిగత కామెంట్లతోనే ఎక్కువగా ఫేమస్ అవుతూ వస్తోంది. తాప్సి అప్పుడప్పుడు బాలీవుడ్ మీద చేసే కామెంట్లు సెన్సేషనల్ అవుతూ ఉంటాయి. బాగా పేలుతుంటాయి. అందుకే తాప్సికి ఫైర్ బ్రాండ్ అన్న బిరుదు కూడా బీ టౌన్ మీడియా ఇచ్చేసింది.
తాప్సి గతంలో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఎన్ని సినిమాలలో నటించింది. అయితే ఇక్కడ అగ్ర హీరోయిన్ల లిస్టులో చేరలేదు. గోపీచంద్, రవితేజ, మంచు సోదరులు లాంటి మీడియం రేంజ్ హీరోలతో పాటు సినీయర్ హీరోలలో ఒక్క విక్టరీ వెంకటేష్ పక్కన షాడో సినిమా చేసింది. ఆ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఆమె టాలీవుడ్లో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సి అక్కడే వరుసగా సినిమాలు చేస్తోంది.
ఆమె తన తాజా ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సౌత్ కంటే బాలీవుడ్ లోనే కాస్టింగ్ ఎక్కువగా ఉందని కుండ బద్దలు కొట్టింది. తను బాలీవుడ్‌కు వచ్చిన కొత్తలో చాలామంది హీరోలు.. దర్శకులు కూడా ఫోన్ చేసి మరి అర్ధరాత్రి వారి గెస్ట్ హౌస్ కు రమ్మని వారిని.. తాను అలాంటి దానిని కాదని చెప్పినా కూడా వినకుండా ఫోన్లు చేసి మరి విసిగించే వారిని తాప్సి చెప్పింది.
అయితే వారి పేర్లు మాత్రం ఆమె బయట పెట్టలేదు. ఇక ఇద్దరుకీ హీరోలు తమతో డేటింగ్ చేయాలని చాలా కాలం నన్ను వేధించారని… నీకు సినిమాల్లో ఛాన్స్ లు రాకుండా చూస్తామని బెదిరించారు. అయితే వాటిని తాను సీరియస్‌గా తీసుకోకుండా.. తన కష్టాన్ని నమ్ముకుని ఇక్కడ వరకు వచ్చాను అంటూ తాప్సి తెలిపింది. తాప్సీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి.