Moviesసమంత - అనుష్కకు సేమ్ టు సేమ్ ప్రాబ్ల‌మ్స్‌… చూశారా…!

సమంత – అనుష్కకు సేమ్ టు సేమ్ ప్రాబ్ల‌మ్స్‌… చూశారా…!


స్టార్ హీరోలతో సమానంగా హీరోయిన్లకు సినిమాల తరపున భారీ క్రేజ్ వస్తున్న సమయంలో ప్రమోషన్లలో ఎంతో యాక్టివ్ గా ఉండాలి. దర్శక నిర్మాతను కూడా హీరో, హీరోయిన్ల నుంచి అదే కోరుకుంటారు కానీ.. వారం గ్యాప్లో ప్రేక్షకుల‌ ముందుకు వస్తున్న సమంత, అనుష్కకు ఇప్పుడు ఒకే రకమైన సమస్య ప్రమోషన్లకు రానివ్వకుండా చేస్తుంది

సమంతకు ఎప్పటి నుంచో ఉన్న ఆరోగ్య చికిత్స కోసం అమెరికా వెళ్ళిపోయింది.. అదేదో సినిమా రిలీజ్ తర్వాత వెళ్ళొచ్చు కదా అనే ప్రశ్న కూడా అందరిలో వస్తుంది. కానీ శాకంతులం కోసం ఎంతో కష్టపడిన ఫలితం దక్కలేదు కాబట్టి ఇప్పుడు సక్సెస్ అయ్యాక దాని ఎంజాయ్ చేయాలని సమంత డిసైడ్ అయింది. అయితే ఇక్కడ అనుష్కకు అంత తీవ్రమైన జబ్బు అయితే లేదు.. కొన్నాళ్లుగా మీడియా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడటం లేదు.. కొంచెం లావుగా మారిన మాట వాస్తవమే కానీ మిస్‌ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్లో అనుష్క అభిమానులు ఇది గమనించారు. పైగా ఈ సినిమాల అనుష్కను సన్నగా చూపించడం కోసం ఫిల్టర్లు వాడటం స్పష్టంగా కనిపించింది.

సినిమా రిలీజ్ కు ముందు మీడియా ముందుకు వస్తే లేనిపోని సమస్యలు వస్తాయి అని అనుష్క మీడియా ముందుకు రావడం లేదు. అయితే ఇక్కడ మీడియా ముందుకు రాకపోవటం ఇద్దరి వ్యక్తిగత నిర్ణయం అయినా దీనివల్ల విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి ఇద్దరు పబ్లిసిటీ బరువును తమ భుజాల మీద మోస్తున్నారు. విసుగు లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తు సినిమాని బాగా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు.

అనుష్క- సమంత ఫ్యాన్స్ ఈ విషయంలో నిరాశ పడినా సినిమా హిట్ అయితే చాలని కోరుకుంటున్నారు. యాధృచ్ఛికంగా ఈ రెండు సినిమాలు కూడా ఒక ప్రేమ జంట మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాలు కావటం ఇక్కడ మరో విశేషం. అయితే బిజినెస్ పరంగా ఖుషి ఇదే పైచే అయినా.. శెట్టి సినిమాను తక్కువ అంచనా అయితే వేయకూడదని అంటున్నారు. మరి ఈ ఇద్దరు లేడీ సూపర్ స్టార్స్ లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news