MoviesRRRకు ఆరు జాతియ అవార్డులు.. అయినా సంతోషంగా లేని రాజమౌళి..ఎందుకంటే..?

RRRకు ఆరు జాతియ అవార్డులు.. అయినా సంతోషంగా లేని రాజమౌళి..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా 69వ జాతీయ అవార్డుల విన్నింగ్ లిస్ట్ ని రిలీజ్ చేశారు నిర్వాహకులు . అయితే ఈసారి ఎప్పుడూ లేనివిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏకంగా 10 అవార్డులు దక్కించుకున్నారు సినీ స్టార్స్. కాగా ఎవరు ఊహించని విధంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఏకంగా ఆరు అవార్డులు వచ్చాయి . పలు విభాగాల్లో జాతీయ అవార్డులు లభించాయి.

అయినా సరే ఆర్ఆర్ఆర్ సినిమా డైరెక్టర్ రాజమౌళి సంతృప్తికరంగా లేడు అంటూ తెలుస్తుంది . దానికి కారణం ఆయన ఎంతగానో ఎక్స్పెక్ట్ చేసిన హీరో కేటగిరీలో అవార్డు రాకపోవడం. ఎస్ ఉత్తమ నటుడిగా రామ్ చరణ్ కు లేదా ఎన్టీఆర్కు అవార్డు రావడానికి చాలా ట్రై చేశారట రాజమౌళి. కానీ ఉత్తమ నటుడుగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు .

ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఆరు అవార్డులు వచ్చిన దేశవ్యాప్తంగా ఇప్పుడు పుష్పరాజ్ పేరు మారుమ్రోగిపోతుంది . కానీ రామ్ చరణ్ – ఎన్టీఆర్ ల పేర్లు ఎక్కడ కనిపించడం లేదు . ఈ క్రమంలోనే రాజమౌళి చాలా డిసప్పాయింట్ అవుతున్నారట . ఆరు అవార్డులు వచ్చిన సరే అనుకున్నా అవార్డు రాలేదు అంటూ బాధపడిపోతున్నారట . ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా భిన్న విభిన్నంగా కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news