టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ కళ్ళు మూసుకుని టక్కున చెప్పే పేరు పూరి జగన్నాథ్ . ఇప్పుడు అంటే ఆయన పేరుకి పెద్ద పాపులారిటీ లేదు . కానీ ఒక అప్పట్లో ఆయన పేరు చెప్తే ఊగిపోయే జనాలు బోలెడు మంది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రవితేజ , ఎన్టీఆర్ లాంటి వాళ్ళని స్టార్స్ గా మార్చింది పూరి జగన్నాథ్ అన్న విషయం అందరికీ తెలిసిందే .
అయితే సినిమా ఇండస్ట్రీలో పెరిగిపోతున్న కాంపిటీషన్ ని తట్టుకోలేక పూరి జగన్నాథ్ సినిమాలు ఫ్లాప్ అయిపోతున్నాయి . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ తనకున్న వెధవ అలవాటు గురించి బయట పెట్టేశాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరి జగన్నాథ్ కు ” మీరు డ్రగ్స్ తీసుకుంటారా ..?” అనే ప్రశ్న ఎదురయింది . అయితే దీనికి ఆన్సర్ ఇస్తూ అయన ..”డ్రగ్స్ తీసుకునే అలవాటైతే నాకు లేదు కానీ.. డైలీ మందు కొట్టే అలవాటైతే ఉంది . అది కూడా నా ఫ్రెండ్ ఆర్జీవి దగ్గర నుంచే నేర్చుకున్నాను.. ఆ వెధవ అలవాటుని మాన్చలేకపోతున్నాను ..డైలీ రాత్రి మందు కొట్టనిదే నిద్ర పట్టదు ..గత మూడేళ్లుగా రోజు ఆ పని చేస్తూనే వచ్చాను . అది మాన్చుకోవాలని ట్రై చేస్తున్న.. అవ్వట్లేదు ” అంటూ ఓపెన్ గా తనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీని అందరికీ చెప్పేసాడు.
దీంతో పూరి జగన్నాథ్ మాటలు వైరల్ గా మారాయి . అంతేకాదు ఆర్జీవి పేర్లు కూడా ఇంక్లూడ్ చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది . ఇంకా ఆర్జీవి దగ్గర నుంచి ఎలాంటి చండాలమైన అలవాట్లు నేర్చుకున్నాడో పూరి జగన్నాథ్ అంటూ కొందరు వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు..!!