తెలుగు సినిమా చరిత్రని ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ చెందేలా చేసిన సినిమా బాహుబలి . అంతక ముందు ఎన్నో సినిమాలు వచ్చిన సరే బాహుబలి తర్వాతే తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్ర ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడుకునేలా చేసింది. ఈ సినిమా ఇంతటి హిట్ అవ్వడానికి ప్రతి ఒక్క నటుడు నటీమణులు ఈ సినిమాలో జీవం పోసినటించడమే అంటూ అందరూ చెప్పుకొచ్చారు . ఈ సినిమాకి మెయిన్ కర్త – కర్మ – క్రియ అంత రాజమౌళిని అన్న సంగతి అందరికీ తెలిసిందే .
ఈ సినిమాల్లో వన్ ఆఫ్ ద టాప్ క్యారెక్టర్ శివగామి దేవి పాత్ర కోసం జక్కన్న చాలా చాలా కష్టపడ్డారట. ఎంతో మంది హీరోయిన్స్ ను అప్రోచ్ అయ్యారట. ఫైనల్లీ శ్రీదేవి ఫిక్స్ అవ్వాలి అనుకున్నారట . కానీ ఆ టైంలో ఆమె పెట్టిన కండిషన్ లు..అడిగిన రెమ్యూనరేషన్ రాజమౌళికి నచ్చక రిజెక్ట్ చేసేసారట . ఫైనల్లీ ఆ పాత్రకు రమ్యకృష్ణను చూస్ చేసుకున్నారు . అయితే రమ్యకృష్ణ సైతం ఈ పాత్ర చేయడానికి కొన్ని క్రేజీ కండిషన్స్ పెట్టిందట. అదే కామెంట్స్ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి.
బాహుబలి సినిమా కోసం రమ్యకృష్ణ పెట్టిన కండిషన్స్ ఏంటంటే రాత్రిపూట షూటింగ్ చేయనని ముందే చెప్పేసిందట . అంతేకాదు అడిగిన దానికి ఒక కాల్ షీట్ కూడా ఎక్కువ ఇవ్వను అని ముందుగానే క్లారిటీ ఇచ్చిందట . అంతేనా తన నోటి నుంచి ఎటువంటి బూతు పదాలు కూడా రావని ..ఎవర్ని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడనని క్లారిటీ ఇచ్చిందట. మరి ముఖ్యంగా జంతువులని నరకడం లాంటివి తనతో గ్రాఫిక్స్ లో కూడా చేయించకూడదు అంటూ చెప్పుకొచ్చిందట . ఆశ్చర్యమేంటంటే అందరికీ కండిషన్స్ పెట్టే జక్కన్న రమ్యకృష్ణ పెట్టిన కండిషన్స్ ఏమాత్రం రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేశారు . అందుకే రమ్యకృష్ణ ఈ పాత్రలో ఒదిగి పోయి నటించింది . ఈ పాత్రకు రానా – ప్రభాస్ ఎంత కీలకంగా మారారో అంతకంటే కీలకంగా మారింది శివగామి దేవి పాత్ర . మొత్తానికి ఈ సినిమాతో రమ్యకృష్ణ జనాల్లో చెరగని స్థానం సంపాదించుకుందనే చెప్పాలి..!!!