Moviesఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు రియల్ హీరో ఎవరు: అల్లు అర్జున్...

ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు రియల్ హీరో ఎవరు: అల్లు అర్జున్ నా..? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నా..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే రీసెంట్గా 69వ జాతీయ అవార్డుల విన్నింగ్ లిస్ట్ లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు వరించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ఫస్ట్ టైం ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ అవార్డు అందుకోవడం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది . తెలుగు సినిమా ఖ్యాతిని పెంపొందించాడు అల్లు అర్జున్ అంటూ పలువురు జనాలు పొగిడేస్తున్నారు .

అయితే ఇక్కడే అసలు చిక్కు మొదలైంది . కాగా ఆయన ఇంట్లోనే బెస్ట్ కాంపిటీటర్ గా ఉన్న రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆరు అవార్డులు వచ్చాయి. అయితే ఎక్కడా కూడా ఆర్ఆర్ఆర్ పేరు అంతటి స్థాయిలో ట్రెండ్ అవ్వడం లేదు . ఎక్కడ చూసినా కాని పుష్ప పుష్ప రాజ్ సుకుమార్ బన్నీ పేర్లే మారుమ్రోగిపోతున్నాయి. ఇదే క్రమంలో మరోసారి అల్లు – మెగా ఫాన్స్ మధ్య ఫైట్ నడుస్తుంది .

కావాలనే పలువురు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు చెప్పండి రియల్ హీరో ఎవరు? అల్లు అర్జున్ నా..? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నా..? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది. కానీ అది ఆయన నటన కి కాదు. పాట కోసం. కానీ ఇక్కడ నేషనల్ అవార్డు అందుకున్నాడు బన్నీ ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఉత్తమ నటుడు ఎవరు అని చెప్పడానికి అంటూ పుష్పరాజ్ పోస్టర్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో బన్నీ – రాంచరణ్ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news