గత 48 గంటలుగా సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే మెగా డాటర్ నిహారిక.. ఒకప్పటి స్టార్ హీరో తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలే ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి. కాగా రీసెంట్ గానే మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుండి విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే . ఇలాంటి క్రమంలోనే ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న తరుణ్ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరిగింది.
దీనిపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందించకపోవడంతో అందరూ ఈ వార్తలు నిజమే అనుకున్నారు . వరుణ్ తేజ్ పెళ్లి అయిపోగానే నిహారిక తరణ్ ల పెళ్లి కూడా చేయబోతున్నారు అంటూ గుసగుసలాడుకున్నారు . ఇలాంటి క్రమంలోనే ఆ వార్తలు పీక్స్ కి చేరడంతో తరుణ్ స్పందించాడు. తనపై వస్తున్న వార్తలు నిజం కాదు అని తాను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు .
అంతేకాదు అలాంటిది ఏదైనా ఉంటే తన పెళ్లి విషయం తానే స్వయంగా చెబుతానని .. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు క్రియేట్ చేయొద్దు అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. మొత్తానికి మెగా ఇంటి అల్లుడు కాకుండా తరుణ్ భలే తప్పించుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్..!!