ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా అల వైకుంఠపురంలో – పుష్ప సినిమాలతో రెండు సూపర్ డూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుని కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్లో దూసుకుపోతున్నాడు. ఇక పుష్ప సినిమా అయితే పాన్ ఇండియా రేంజ్ లో కనివినీ ఎరుగని రీతిలో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు కంటే అటు నార్త్ ఆడియన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చేసింది. అందుకే ఒక బాలీవుడ్ లోనే ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది.
ఇది ఒక సంచలనం అనుకుంటే తాజాగా ఈ సినిమాలో నటనకు గాను బన్నీకి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు లభించిన విషయం తెలిసిందే. 90 సంవత్సరాలు తెలుగు సినిమా చరిత్రలో ఒక తెలుగు హీరోకు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి కావడంతో బన్నీ పేరు జాతీయస్థాయిలో మార్మోగిపోతుంది. సాధారణంగా ఒక సినిమాతో సూపర్ హిట్ కొడితే హీరో లేదా హీరోయిన్ కు రెమ్యూనరేషన్ పెరుగుతుంది.
అయితే ఇప్పుడు జాతీయ అవార్డు రాకతో బన్నీకి మరింత బాధ్యత పెరిగింది. ఇప్పటికే పుష్ప 2 సినిమా కోసం బన్నీకి 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇస్తున్నారట నిర్మాతలు. ఇక బన్నీ తర్వాత సినిమాకు ఏకంగా 125 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారట. ప్రస్తుతం బన్నీ పుష్పా సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 లో నటిస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత మరోసారి తనకు కలిసి వచ్చిన మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జతకట్టనున్నాడు. ఈ సినిమాకు బన్నీకు మాత్రమే రు. 125 కోట్ల రెమ్యూనరేషన్ అంటే ఏ తెలుగు హీరో కూడా బన్నీ రెమ్యూనరేషన్‌కు దరిదాపుల్లో లేడనే చెప్పాలి. ఏది ఏమైనా బన్నీ తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయికి పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు అనటంలో సందేహం లేదు.