Newsఅమలను చూస్తేనే అసహ్యించుకునే నాగేశ్వరావు.. లాస్ట్ రోజుల్లో అలా చేసి పాపం...

అమలను చూస్తేనే అసహ్యించుకునే నాగేశ్వరావు.. లాస్ట్ రోజుల్లో అలా చేసి పాపం కడిగేసుకున్నాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ అంటే అందరికీ ముందుగా టక్కున గుర్తొచ్చేది అక్కినేని నాగేశ్వరరావు గారు . అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసుకుని అందరి మనసుల్లో చిరస్థాయిగా మిగిలిపోయాడు . ప్రజెంట్ భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పటికీ ఆయన నటించిన సినిమాల ద్వారా ఇప్పటికీ మన ముందు తిరుగుతూనే ఉన్నారు. కాగ ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగార్జున సైతం అక్కినేని ఇంటిపేరుకి ఉన్న క్రేజ్ డబల్ చేశారే కానీ ఎక్కడ ఏనాడు తగ్గించలేదు .

అయితే నాగార్జున పర్సనల్ విషయంలో మాత్రం అక్కినేని నాగేశ్వరరావు చాలా హార్ట్ చేశారట . దగ్గుబాటి లక్ష్మీని పెళ్లి చేసుకొని ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి మరి అమలను పెళ్లి చేసుకోవడం .. నాగేశ్వరరావుకి ఏమాత్రం ఇష్టం లేదట. కానీ ఆ టైంలో అక్కినేని నాగార్జున మొండిగా ఉండడంతో ఆ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయలేక తప్పలేదు అంటూ గతంలో ఇంటర్వ్యూలు అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పుకొచ్చారు . ఇలాంటి క్రమంలోనే మరో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

మొదటినుంచి అమల అంటే నాగేశ్వరరావు గారికి ఇష్టం లేదు అన్న ప్రచారం ఎక్కువగా సాగింది . అయితే ఆమెను కోడలుగా కూడా యాక్సెప్ట్ చేయని అక్కడిని నాగేశ్వరరావు గారు లాస్ట్ రోజుల్లో ఆమెకు క్షమాపణలు చెప్పారట . అంతేకాదు ” నువ్వు నా కోడలివి కాదు కూతురివి” అంటూ ఆమెను ప్రేమగా ఇంటి బిడ్డగా యాక్సెప్ట్ చేశారట. దానికి కారణం అక్కినేని అమల అక్కినేని ఫ్యామిలీ పై చూపించిన ప్రేమ అంటూ తెలుస్తుంది . మొదటి నుంచి నాగచైతన్య ను అమల ఎక్కడ దూరం పెడుతుందో అని తెగ టెన్షన్ పడ్డారట. కానీ అఖిల్ తో సమానంగా నాగచైతన్యను చూసిన కారణంగా లాస్ట్ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు హెల్త్ పట్ల తీసుకున్న కేరింగ్ కి ని నాగేశ్వరరావు గారు ఎంతో ఆనందపడ్డారట . అంతేకాదు “నిన్ను మొదట్లో బాధపెట్టానమ్మా క్షమించు .. నువ్వు అక్కినేని ఇంటికి పర్ఫెక్ట్ కోడలి వి” అంటూ మరి ఆమెను పొగిడేసారట. దీంతో అప్పట్లో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news