నందమూరి హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న తారకరత్న రీసెంట్ గానే మరణించిన విషయం మనకు తెలిసిందే. ఫిబ్రవరి 22న గుండె సంబంధిత సమస్యతో మరణించాడు. ఆయన మరణం విషయం ఇప్పటికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. నందమూరి తారకరత్న మన మధ్య ఉన్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు . నందమూరి తారకరత్న అభిమానులకు ఓ జ్ఞాపకంలా మారిపోయారు . ఆయన మరణించిన విష్యాని తారకరత్న అభిమానులు మర్చిపోలేక పోతున్నారు.
నారా చంద్రబాబునాయుడు కొడుకు లోకేష్ యువ్వగలం పేరుతో చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కుప్పకూలిపోయారు . ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో గుండెనొప్పి వచ్చింది . ఆ తర్వాత బెంగళూరులోని హృదయాలయ హాస్పిటల్ చికిత్స తీసుకుంటూ ఆయన తుది శ్వాస విడిచారు . ఆ టైంలో ఆయన భార్య పిల్లలు విలపించిన దృశ్యాలు ఇప్పటికీ మన కళ్ళముందే మెదులాడుతూ ఉంటాయి . కాగా నేడు తారకరత్న కొడుకు కూతురు పుట్టిన రోజు.
తారకరత్నకు కవల పిల్లలు ఉన్న విషయం తెలిసిందే . తన్యారామ్ , రేయ . ఈరోజు వాళ్ళ పుట్టినరోజు. దీంతో అలేఖ్య రెడ్డి .. తారకరత్న ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. తారకరత్న తో వాళ్లకున్న అనుబంధాన్ని ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ గా స్పందించింది. . ఈ సంతోషకర సమయంలో ఎంత ప్రయత్నించినా నవ్వడం నా వల్ల కావడం లేదు..మన బిడ్డలకి ఆనందంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నాను .. నువ్వు నా పక్కనే ఉండి ఉంటే చాలా ఆనందంగా ఉండేది . కానీ పిల్లల సంతోషం రూపంలో నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావు అనుకుంటున్నాను ” అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ షేర్ చేసింది అలేఖ్య రెడ్డి. దీంతో మరోసారి సోషల్ మీడియాలో నందమూరి తారకరత్న పేరు ట్రెండ్ అవుతుంది..!!