టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పోకిరి. 2006 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. మహేష్ బాబు కి జోడిగా ఇలియానా హీరోయిన్గా నటించింది. ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో అన్నట్టుగా మహేష్ బాబు కొట్టిన దెబ్బకు ఇండస్ట్రీ పాత రికార్డులు అన్ని చెరిగిపోయాయి.
అయితే ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒక హిట్ సినిమా స్ఫూర్తితో తెరకెక్కిందని ఇండస్ట్రీ జనాలు చెబుతూ ఉంటారు. ఆ సినిమా ఏదో కాదు 1989లో చిరంజీవి – భానుప్రియ జంటగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన స్టేట్ రౌడీ. అయితే ఈ సినిమాపై అప్పట్లో ఒక ఆరోపణ ఉంది. 1975లో వచ్చిన బాలీవుడ్ యాక్షన్ క్రైమ్ మూవీ దీవార్ సినిమా నుంచి కాపీ కొట్టి స్టేట్ రౌడీ తీశారని అంటారు.
ఆ సినిమా పాత్రలు, కథా సన్నివేశాలు దీవార్ సినిమాను పోలి ఉంటాయి. దివార్ సినిమాలో అమితాబచ్చన్, శశి కపూర్ నటించారు. అమితాబచ్చన్ ఒక డాన్ కాగా శశికపూర్ ఒక పోలీస్ ఆఫీసర్. అయితే స్టేట్ రౌడీ సినిమాలో ఈ రెండు పాత్రలను చిరంజీవి పోషించారు. స్టేట్ రౌడీ సినిమాలో చిరంజీవి ఇతర రౌడీలను ఎలిమినేట్ చేసే రౌడీ ఖాళీ చరణ్‌గా.. ఇటు నాగమణి వద్ద పనిచేస్తున్న పోలీస్ ఇన్ ఫార్మర్ పృథ్వి అని తెలుస్తుంది.
ఇక పోకిరి సినిమాలో మహేష్ బాబు మొదటి రౌడిగా కనిపిస్తాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్గా అతని పాత్ర రివీల్ చేస్తారు. ఈ రెండు సినిమాల్లోనూ ఒక గ్యాంగ్ స్టర్ గా ఉండే కథానాయకుడు కనిపిస్తాడు. అయితే వాస్తవానికి అతడు మంచి మనసున్న వ్యక్తిగా తర్వాత చూపిస్తారు. పోకిరి సినిమాలో మోడ్రన్ వరల్డ్ సెట్ చేయగా.. స్టేట్ రౌడీలో కాస్త పాత తరం గ్యాంగ్ స్టార్ స్టోరీ సెట్ చేశాడు దర్శకుడు బి.గోపాల్.
ఇక పోకిరి స్టేట్ రౌడీ సినిమా కంటే కూడా ఎక్కువ యాక్షన్ సినిమాగా ఉంటుంది. ఇక పోకిరిలో కామెడీ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలా మొత్తం మూడు సినిమాలు దాదాపు ఒకే కథతో వచ్చి ప్రేక్షకులను అలరించాయి.